• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద భారీ భద్రత

VKB: కొడంగల్ పట్టణంలో ఆశా కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కరించమని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున నుంచే పోలీసులు ఇంటి పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రహదారులను బారికేడ్లతో కట్టివేసి, ప్రతి వ్యక్తి వివరాలు అడిగి తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళడానికి అనుమతిస్తున్నారు.

March 20, 2026 / 08:56 AM IST

పండుగ రోజు బాలిక మృతి

SRD: హత్నూర మండలం కాసాల గ్రామంలో పాముకాటుకు గురై ముసునూరి సింధూజ (17) అనే బాలిక మృతి చెందింది. గురువారం తల్లిదండ్రులు పనికి వెళ్లి వచ్చేసరికి బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి మరణించింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

March 20, 2026 / 08:55 AM IST

రైతు ఉత్సవాలకు హాజరుకావాలి: ఏఓ

HNK: నర్మెట్టలో నేటి నుంచి నిర్వహించనున్న రైతు మేళా ఎగ్జిబిషన్, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఏవో శ్రీనివాస్ అన్నారు. రైతు మేళా ఎగ్జిబిషన్, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాలు ఉంటాయని, ఈ నెల 20, 21, 22న జరిగే ఈ ఉత్సవాలకు శాయంపేటలోని అన్ని గ్రామాల రైతులు హాజరు కావాలన్నారు.

March 20, 2026 / 08:54 AM IST

గురుకుల మహిళా డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం

మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డా. జె. జయప్రద తెలిపారు. ప్రవేశాలు రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా కల్పిస్తామని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

March 20, 2026 / 08:53 AM IST

నల్లకుంటలో గ్యాస్ ఏజెన్సీ ఎదుట ఖాళీ సిలిండర్లతో క్యూ

HYD: గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. నల్లకుంటలో గ్యాస్ ఏజెన్సీ ఎదుట ఖాళీ సిలిండర్లతో నివాసితులు క్యూలలో నిలబడి రీఫిల్ కోసం ఎదురుచూస్తున్నారు. సరఫరా లోపంతో గృహ వినియోగ ఎల్పీజీ అందుబాటులో లేక, సమస్య ఉందని, దీనిని త్వరగా పరిష్కరించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

March 20, 2026 / 08:51 AM IST

AI, ఆటోమేషన్ సంస్థలు స్థాపించడం గర్వకారణం: MLA

WGL: వరంగల్ నగరంలో BotsIn LLC సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… యువత సాంకేతిక రంగంలో ముందుకు రావడం శుభపరిణామమని, వరంగల్ వంటి నగరాల్లో కూడా AI, ఆటోమేషన్ సంస్థలు స్థాపించడం గర్వకారణమని, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఉద్యోగావకాశాలు సృష్టించే దిశగా ఇలాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలన్నారు.

March 20, 2026 / 08:50 AM IST

ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

SDPT: బెజ్జంకి మండలంలో ఆశా వర్కర్ల ఆందోళన కొనసాగుతుంది. గత పది రోజులుగా జీతాలు రాకపోవడంతో పాటు మూడు నెలల బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం విధులకు హాజరుకాకుండా నిరసన చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పోలీసులు జోక్యం చేసుకుని పలువురు ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకుని ముందస్తుగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

March 20, 2026 / 08:49 AM IST

మండుతున్న ఎండలో వన్నె తగ్గని పచ్చదనం

HYD: ఈ ఏడాది వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. వర్షాకాలం, చలికాలంలో పచ్చని చెట్లు, మొక్కలతో కలకలాడే కొన్ని ప్రాంతాలు ఎండవేడికి మాడిపోతుంటాయి. కానీ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పచ్చదనం ఏడాదంతా పదిలంగానే ఉంటది. పచ్చని ఆకులు, ఎర్రని పూలతో ఉద్యానవనాన్ని తలపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.

March 20, 2026 / 08:48 AM IST

HYDలో ఏప్రిల్ నుంచి తీవ్రమైన వడగాలులు.. జాగ్రత్త..!

HYDలో వడగాలుల ముప్పు పెరిగే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగరానికి అలర్ట్ ప్రకటిస్తూ, ఏప్రిల్ నుంచి మే నెల వరకు తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొనే అవకాశముందని తెలిపింది. ఈ కాలంలో పగలు మాత్రమే కాదు, రాత్రివేళల్లో కూడా వడగాలులు ఎక్కువగా ఉండనున్నాయని స్పష్టం చేసింది.

March 20, 2026 / 08:42 AM IST

హిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో RSS పాత్ర కీలకం

NZB: హిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో RSS పాత్ర కీలకమని NZB అర్బన్ MLA ధన్‌పాల్ సూర్య నారాయణ అన్నారు. RSS ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. హిందువుల ప్రతి పండుగను, ఆచార వ్యవహారాలను చాటి చెప్పడంలో RSS ముందుంటుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో హిందువులు జాగృతమవడమే కాకుండా ఐక్యత పెరుగుతుందన్నారు.

March 20, 2026 / 08:40 AM IST

మహిళా సంఘం భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ

KNR: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో గురువారం స్వశక్తి మహిళా సంఘం భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంఘ భవనం ద్వారా వారి కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

March 20, 2026 / 08:40 AM IST

ఉప్పల్ సర్కిల్‌లో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 45 కోట్లు

MDCL: ఉప్పల్ సర్కిల్‌లో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 45 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.38 కోట్లు వసూలు చేసినట్లు DC రాజు తెలిపారు. ఇంకా రూ.7 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు. లక్ష్యాన్ని పూర్తిగా సాధించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బకాయిదారులపై దృష్టి సారించి వసూళ్లను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.

March 20, 2026 / 08:35 AM IST

దారిదోపిడి, హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్ట్

ADB: దారిదోపిడి, హత్యాయత్నం కేసులో పట్టణంలోని బంగారు కూడా కాలనీకి చెందిన నిందితుడు దండుగుల వెంకటేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఫణిదర్ తెలియజేశారు. లిఫ్ట్ పేరుతో లాండసాంగ్వి గ్రామానికి చెందిన బాధితుడు జుంగారే అశోక్‌ను బండరాయితో కొట్టి, కత్తితో గాయపరిచినట్లు వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

March 20, 2026 / 08:34 AM IST

FLASH: ప్రభుత్వ విప్‌లుగా అద్దంకి దయాకర్, డా.బల్మూర్ వెంకట్

HYD: తెలంగాణ శాసనమండలిలో ప్రభుత్వ విప్‌లుగా అద్దంకి దయాకర్, డాక్టర్ బల్మూర్ వెంకట్ నర్సింగ్ రావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాసనసభ వ్యవహారాల్లో సమన్వయం, పార్టీ విధానాల అమలులో విప్‌లు కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో HYDలో వారి అభిమానులు, కాంగ్రెస్ నేతలు మన యూనివర్సిటీ సహా పలుచోట్ల సంబరాలు చేసుకున్నారు.

March 20, 2026 / 08:34 AM IST

గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

నల్గొండ జిల్లా పి.ఏ పల్లి మండలం రంగారెడ్డిగూడెం స్టేజీ సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ​మృతుడిని గుర్రంపోడు మండలం కాసారం గ్రామానికి చెందిన బొమ్మనమోని అఖిల్ (23)గా గుర్తించారు.

March 20, 2026 / 08:32 AM IST