నల్గొండ జిల్లా పి.ఏ పల్లి మండలం రంగారెడ్డిగూడెం స్టేజీ సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం బైక్ను బలంగా ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని గుర్రంపోడు మండలం కాసారం గ్రామానికి చెందిన బొమ్మనమోని అఖిల్ (23)గా గుర్తించారు.