NZB: కోటగిరిలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏటా నిర్వహించే కుస్తీ పోటీలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఆ రాష్ట్రం నుంచి మల్లయోధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్ద గంగాధర్ దేశాయ్, సర్పంచ్ బర్ల మధుకర్ పాల్గొన్నారు.
MDK: తూప్రాన్ పట్టణంలోని బ్రాహ్మణపల్లి వార్డులో ఉగాది పర్వదినం సందర్భంగా వాటర్ ప్లాంట్‌ను ఛైర్ పర్సన్ బొంది రజని రాఘవేందర్ గౌడ్ ప్రారంభించారు. ఎన్నికల సమయంలో చెడిపోయిన ప్లాంట్‌ను పునరుద్ధరించనున్న హామీ మేరకు ఈ చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మునిరాతి లక్ష్మీ మల్లేష్, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
JN: హైదరాబాదులో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులను రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కలిసి రైతు ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానం అందజేశారు. అనంతరం రైతు ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు, ఇతర అంశాలపై కాసేపు వారితో రాఘవరెడ్డి క్షుణ్ణంగా చర్చించారు.
BHNG: గుండాల(మం) అంబాల గ్రామం హనుమాన్ దేవాలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సర్పంచ్ జక్కుల రాణమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు నూతన సంవత్సర ఫలితాలను భక్తులకు వివరించారు. దశాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారంలో గ్రామస్థులంతా ఏకమై పాల్గొనడం విశేషం. గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.
SRPT: మునగాల(మం) బరఖత్ గూడెంలోని వెంకటేశ్వర ఆలయంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడి చారిత్రాత్మకమైందని, ఉగాది సందర్భంగా లక్ష పుష్పార్చన పూజా నిర్వహించడం తమకు దక్కిన భాగ్యమని చెప్పుకొచ్చారు.
SRCL: ఉగాది పండుగను పురస్కరించుకుని దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ పుణ్యక్షేత్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున, భీమేశ్వరాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేద పండితులు, అర్చకులను ఘనంగా సత్కరించారు.
ADB: నేరాల నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని SP అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీలను గ్రామస్థులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గంజాయికి దూరంగా, రోడ్డు భద్రత, మహిళల భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు పాటించిన గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
HNK: మానసిక దివ్యాంగుల సమస్యలపై పార్లమెంటులో పోరాటం చేస్తానని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనో వికాస కేంద్రంలో ఉగాది పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఎంపీ పాల్గొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దివ్యాంగుల భద్రత, సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఎంపీ కోరారు.
SRCL: ఉగాది పండుగ సందర్భంగా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో చిన్నారులకు ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ ఆనవాయితీ ఏళ్ల తరబడి కొనసాగుతోంది. పండుగ రోజున చిన్న పిల్లలకు పెద్దలు కొత్త బట్టలు ధరింపజేసి వారి మెడలో కుడుకలు, బిస్కట్లు, పల్లి దండలు, డ్రై ఫ్రూట్స్ బహుమతుల హారాలను వేస్తూ ఆశీర్వచనాలు అందజేస్తున్నారు.
WNP: మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీరంగాపురం మండల BRS పార్టీ నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ దేవుని ఆకాంక్షిస్తున్నానట్లు చెప్పుకొచ్చారు.
RR: శేరిలింగంపల్లి రాజీవ్ గృహకల్పలోని సాయిబాబా ఆలయ అభివృద్ధిలో భాగంగా మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నూతన బోర్ వెల్‌ను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణంలో పాల్గొని నూతన సంవత్సర ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
PDPL: భక్తికి రూపం ఉంటే అది ఓదెల మల్లన్న క్షేత్రంలో కనిపిస్తుంది. ఉగాది పర్వదినం వేళ పెద్దపల్లి జిల్లా ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా హరిపురం గ్రామ యాదవ కులస్తులు తమ 40 ఏళ్ల నాటి అరుదైన సంప్రదాయాన్ని చాటుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన మేకపోతుల రథంతో భక్తులు ఊరేగింపుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
KMM: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో గల శ్రీ కోట మైసమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పవిత్ర బ్రహ్మోత్సవాల జరగునున్నాయి. ఈ మేరకు ఆలయ ఛైర్మన్ డాక్టర్ పర్స పట్టాభి రామారావు, ఈవో కె వేణుగోపాల చార్యులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
MNCL: రాష్ట్ర BJP ఆదేశాల మేరకు ఈనెల 20న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ ముందు చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని కోరుతూ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కావున జిల్లా, మండల నాయకులందరూ ఈ ధర్నా కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
SRD: చిన్నకోడూరు మండలంలోని ఆయా గ్రామాల్లో ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని, భక్షాలను తయారు చేసి ఆరగించారు. కాగా, ఆయా గ్రామాల్లో పండితులు నూతన సంవత్సర పంచాగాన్ని ప్రజలకు వినిపించారు.