MHBD: కొత్తగూడ మండలం గోపాలపురం గ్రామ పరిధిలో గురువారం గబ్బిలాలు విద్యుత్ లైన్లపై పడడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మూడు చోట్ల తీగలు తెగిపోయాయి. ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఉప సర్పంచ్ అశోక్ వెంటనే స్పందించి విద్యుత్ అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. సరైన యూ-టర్న్ లేకపోవడంతో వాహనదారులు రాంగ్ రూట్‌లో వెళ్తున్నారని, అందుకే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
GDWL: ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని గద్వాల కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పటేల్ శ్రీనివాస్ రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు వారిని స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
ASF: సిర్పూర్ (టి) మండలం డోర్పల్లి సర్పంచ్ సమీరా ఎన్నికను ఎలక్షన్ ట్రైబ్యునల్ రద్దు చేసింది. నామినేషన్ సమయంలో ఆమెకు కనీస వయస్సు (21 ఏళ్లు) నిండలేదని RDO లోకేశ్వర్రావు నిర్ధారించారు. ఆధార్, పాన్, ఓటర్ ఐడీల్లో తప్పుడు వివరాలతో పోటీ చేసినట్లు రుజువు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే సర్పంచ్ పదవిని భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.
SRD: ఖేడ్ RTC బస్సు డిపోలో ఉద్యోగుల ఆధ్వర్యంలో శ్రీ పరాభవ తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డిపో మేనేజర్ VVS సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా తయారు చేసిన ఉగాది పచ్చడిని ఉద్యోగులకు వితరణ చేశారు. ఈ ఏడాదిలో ఉద్యోగులందరూ సుఖశాంతులతో ఉండాలని డీఎం ఆకాంక్షించారు. ఇందులో AM(T) నర్సింలు, AE(M) శ్రీనివాసు ఉన్నారు.
HYD: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలు ఉదయం నుంచే భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ఎన్బీటీనగర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.
MDK: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో పెద్ద శంకరంపేట శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డా. కేశవరావు పల్లిరాం పంత్ హెడ్గేవర్ జి జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. 1925లో నాగపూర్‌లో డాక్టర్ జి సంఘ శాఖలను ప్రారంభించగా ఆర్ఎస్ఎస్ శాఖలు, ప్రపంచం వ్యాప్తంగా విస్తరించినట్లు తెలిపారు.
MDCL: అల్వాల్ పట్టణం కనజగూడలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు దర్శనం కోసం బారులు తీశారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఆలయ అభివృద్ధికి భక్తులు సహకరించాలని నిర్వాహకులు కోరారు.
SRD: నిజాంపేట్ మండల కేంద్రంలో ముస్లింలకు ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నేడు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్స్ అందజేశారు. రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరీమణులను గౌరవించి ఈ తోఫాను అందించినట్లు తెలిపారు. అన్ని మతాలు సమానంగా అందరూ క్షేమంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
PDPL: రామగుండం NTPC- కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్ ఆధ్వర్యంలో యువతీ, యువకులకు కంప్యూటర్ రంగంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు యజమాన్యం ప్రకటించింది. DGCA, GST, ట్యాలీ కోర్సులలో ట్రైనింగ్ ఇస్తామన్నారు. కోర్సులు పూర్తి చేసిన వారు ఉపాధి అవకాశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 9794180335, 8106044670 నంబర్లను సంప్రదించాలన్నారు.
MHBD: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 19న జరగాల్సిన వారాంతపు సంత (తైబజార్) వేలం ఉగాది పండుగ సందర్భంగా వాయిదా పడినట్లు మున్సిపల్ కమిషనర్ దయానంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మళ్లీ ఈ వేలం పాటను ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి గల వేలందారులు ఈ మార్పును గమనించి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు.
MLG: జిల్లా TS MRPS తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా అశోక్‌ను నియమించినట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ మాదిగ తెలిపారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. జిల్లాలో దళిత జాతి హక్కుల సాధనకు, మాదిగల రిజర్వేషన్ పోరాటానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన జిల్లా, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
KMM: కామేపల్లి మండలం పాత లింగాల గ్రామంలో నూతన సిసి రోడ్డు కు శంకుస్థాపన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి, పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తుందన్నారు.
BDK: ఉగాది పండుగ పురస్కరించుకుని మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని ఇవాళ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో నరేష్ డీఎస్పీ రవీందర్ రెడ్డి సిఐ నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
NLG: కవులు సమాజంలోని ప్రజలను చైతన్యవంతం చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని పేర్కొన్నారు. యువకులు కూడా సాహిత్యంపై ఆసక్తిని పెంచుకోవాలని అన్నారు. నకిరేకల్ లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించి కవులను సత్కరించారు. ఈ సందర్భంగా సమస్యలు, అభివృద్ధిపై కవులు తమ కవితలను వినిపించారు.