MDCL: ఉప్పల్ సర్కిల్లో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 45 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.38 కోట్లు వసూలు చేసినట్లు DC రాజు తెలిపారు. ఇంకా రూ.7 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు. లక్ష్యాన్ని పూర్తిగా సాధించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బకాయిదారులపై దృష్టి సారించి వసూళ్లను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.