TG: 2026 చివరి నాటికి సనత్‌నగర్, LBనగర్, అల్వాల్ టిమ్స్‌లను ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో 6,582 టెర్షియరీ కేర్ బెడ్లు అందుబాటులోకి తెస్తామన్నారు. ఇప్పటికే 9 ప్రభుత్వ మెడికల్, 16 నర్సింగ్, 28 పారా మెడికల్ కాలేజీలు ప్రారంభించినట్లు వివరించారు. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తామన్నారు.