TG: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం భరోసానిచ్చింది. పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2026 జూన్ 2 నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.