TG: పింఛన్ల విషయంలో బడ్జెట్లో కోత పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 12.1 శాతం ఉండేదన్నారు. కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 10.2 శాతానికి తగ్గిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పరిపాలన వైఫల్యం వల్లే.. తలసరి ఆదాయం తగ్గిందన్నారు. వృద్ధులకు రూ. 4 వేలు పింఛన్ ఇస్తారేమో అని చూశామని.. కానీ మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు.