AP: తమ పూజ గదిలోని బొమ్మపై నెట్టింట చర్చ జరుగుతున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించారు. ‘ మా పూజ గదిలోని బొమ్మల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం.. అది దేవాన్ష్ తన నాలుగేళ్ల వయసులో చేతితో తయారు చేసిన శివుని బొమ్మ, చిన్న శివలింగం. దేవాన్ష్ శివుడిపై భక్తితో ఈ బొమ్మల్ని తయారు చేశాడని.. దానిని ఒక జ్ఞాపకంగా పూజ గదిలో ఉంచాం’ అంటూ పేర్కొన్నారు.