WGL: నియోజకవర్గంలోని పేదల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంతో నెరవేరుతుందని, ఇందుకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారం కీలకమని TPCC సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెక్కొండ మండలంలోని టీకే తండలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు నిర్మించి గౌరవప్రదమైన జీవనం కల్పించేందుకు ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.