KRNL: దేవనకొండ సంత మార్కెట్లో నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో (PM-ABHIM) పథకం కింద రూ.42 లక్షలు మంజూరు చేయడంతో ఈ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఆరోగ్య కేంద్రం పూర్తైతే దేవనకొండ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.