KDP: చెన్నూరులోని సరస్వతినగర్‌లో శుక్రవారం ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు పన్నుల వసూళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాల సదుపాయాలకు నిధులు అవసరమని, ప్రజలంతా పెండింగ్‌లో ఉన్న ఇంటి, కుళాయి, తదితర పన్నులను ఈ నెలాఖరులోగా వందశాతం చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.