• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్

KNR: హుజూరాబాద్ పట్టణంలో ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే ముస్లింలు భారీగా తరలివచ్చి ప్రత్యేక నమాజ్ చేశారు. నెల రోజుల ఉపవాస దీక్ష అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

March 21, 2026 / 04:25 PM IST

‘గరికపాటి పై చర్యలు తీసుకోవాలి’

MDK: పేద విద్యార్థుల ఆత్మగౌరవం దెబ్బతీస్తూ, ప్రభుత్వ పాఠశాలపై అపనిందలు మోపుతూ వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని SFI డిమాండ్ చేసింది. జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, తూప్రాన్ డివిజన్ కార్యదర్శి అంజనేయులు వేరువేరు ప్రకటన విడుదల చేశారు. ప్రవచనాల పేరుతో విద్యార్థులపై అసభ్యంగా అవమానకరంగా మాట్లాడినట్లు పేర్కొన్నారు.

March 21, 2026 / 04:22 PM IST

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి

MBNR: జిల్లా న్యూ గంజ్ మార్కెట్ యార్డ్ ఈద్గా వద్ద రంజాన్ పర్వదినం కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినం ముస్లింల గొప్ప పండగ, సందర్భంగా సన్మార్గంలో నడుస్తూ.. మానవత్వం చాటాలనే సందేశాన్ని రంజాన్ ఇస్తుందన్నారు.

March 21, 2026 / 04:20 PM IST

మక్తల్‌లో ఘనంగా రంజాన్ ప్రార్థనలు

NRPT: మక్తల్‌లో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వందలాది మంది హాజరై ప్రార్థన స్థలాలు కిటకిటలాడాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉదయం ఈద్గా మైదానాలకు చేరుకుని నమాజ్ చేశారు. అనంతరం ఖురాన్ బోధనలు వినిపించారు.

March 21, 2026 / 04:17 PM IST

పాఠశాలల్లో అడ్మిషన్.. తలకు మించిన భారంగా ఫీజులు

RR: ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉప్పల్, అత్తాపూర్ ప్రాంతాల్లో నర్సరీ ఫీజులు భారీగా పెరిగాయి. కొన్ని పాఠశాలల్లో రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు అదనంగా ఉండటంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

March 21, 2026 / 04:17 PM IST

ఉపాధి హామీ పనులకు శంకుస్థాపన

KMM: చింతకాని మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామపంచాయతీలో శనివారం ఉపాధి హామీ పథకం కింద రూ.8 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిఫారసుతో మంజూరైన ఈ పనులను మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, సర్పంచ్ ఓర్సు వీరభద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పల గోవిందరావు పాల్గొన్నారు.

March 21, 2026 / 04:13 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆదివాసి సంఘం నేతలు

MHBD: కొత్తగూడ(M)బొత్తావానిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల కమిటీ కోశాధికారి పుల్సం సురేందర్ ఇటీవల అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్, గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.

March 21, 2026 / 04:12 PM IST

మధ్యలో నిలిచిన పనులు.. తప్పని తిప్పలు!

MDCL: ఉప్పల్, మౌలాలి, నాచారం ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పేరుతో రోడ్లు తవ్వి మధ్యలోనే వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు, మట్టితో ప్రయాణం కష్టంగా మారి తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పనులు వేగంగా పూర్తి చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

March 21, 2026 / 04:12 PM IST

రామప్ప ఆలయాన్ని సందర్శించిన విదేశీయులు

MLG: జిల్లాలో యునిస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని శనివారం అమెరికాకు చెందిన రేటా హేంగ్, మెక్సికోకు చెందిన రోలండో అలెక్జరియా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి వారి చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ గైడ్ వెంకటేష్ ఆలయ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

March 21, 2026 / 04:08 PM IST

‘రెండు నదులు జిల్లా పక్కన పారుతున్న ఉపయోగం లేదు’

రెండు నదుల మధ్య ఉన్నా నడిగడ్డ రైతులకు చుక్క నీరు అందకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ. గోపాల్ అన్నారు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ జనసభ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆర్డీఎస్ కింద 87 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు.

March 21, 2026 / 04:03 PM IST

త్వరలో 25 RTC బస్ డిపోలలో ఛార్జింగ్ స్టేషన్లు

HYDలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రోత్సాహానికి కీలక అడుగులు పడుతున్నాయి. 25 ఆర్టీసీ డిపోలలో ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలో 2200 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం అవసరమైన ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను ఇప్పటికే అధికారులు పరిశీలించారు.

March 21, 2026 / 04:02 PM IST

బెడిసి కొట్టిన బుజ్జగింపు వ్యూహం.. బేజారైన మంత్రులు

JGL: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిను బుజ్జగించే ప్రయత్నాలు బెడిసిక కొట్టినట్లు తెలుస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం ఆయనతో గంటకు పైగా భేటీ అయ్యారు. పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తన నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం జీవన్ రెడ్డి పేర్కొనడంతో మంత్రులు అవాక్కయ్యారని సమాచారం.

March 21, 2026 / 04:00 PM IST

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థి

MDK: చేగుంటకు చెందిన బ్రిలియంట్ స్కూల్ విద్యార్థిని హన్విత కోరుకొండ సైనిక్ స్కూల్ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో సత్తా చాటారు. ఇటీవల జరిగిన ప్రవేశ పరీక్షకు హాజరు కాగా, 223/300 మార్కులు సాధించారు. పాఠశాల కరెస్పాండంట్, ప్రిన్సిపాల్ క్రష్ణకుమార్, డైరెక్టర్లు సీహెచ్ సురేష్ కుమార్, షైక్ ఆరిఫ్, పాఠశాల ఉపాధ్యాయలు విద్యార్థిని అభినందించారు.

March 21, 2026 / 04:00 PM IST

సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ

SDPT: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభించడంపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో నిలిపివేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.పెండింగ్ ఉన్న రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధులను విడుదల చేయాలని కోరారు.

March 21, 2026 / 04:00 PM IST

షబ్బీర్ అలీకి రంజాన్ శుభాకాంక్షలు

KMR: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు చివరి అంకమైన ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరభావం, సమానత్వం, సమైక్యతా స్ఫూర్తి సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని బోకే, శాలువాతో సన్మానించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

March 21, 2026 / 03:55 PM IST