RR: ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉప్పల్, అత్తాపూర్ ప్రాంతాల్లో నర్సరీ ఫీజులు భారీగా పెరిగాయి. కొన్ని పాఠశాలల్లో రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అదనంగా ఉండటంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.