VKB: బంట్వారం మండల కేంద్రంలోని మసీదులో నిన్న ముస్లిం సోదరుల కోసం ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు ఆచరించే వారికి ఇది ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మత సామరస్యానికి, సోదరభావానికి ప్రోత్సాహమివ్వాలని తెలిపారు. స్థానికులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.