MDCL: ఉప్పల్, అత్తాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లో విద్యార్థులకు రోబోటిక్స్ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిన్నప్పటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి పెంచేందుకు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. రోబోలు ఎలా పనిచేస్తాయో, కోడింగ్ ప్రాథమికాలు నేర్పుతూ భవిష్యత్‌కు సిద్ధం చేస్తున్నారు. ఈ అంశంపై పిల్లలు ఆసక్తి చూపించడం గమనార్హం.