BDK: 2025 జనవరి నుంచి జిల్లావ్యాప్తంగా 86 కేసులు నమోదు చేసి, రూ. 34 కోట్ల విలువైన 6,844 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. గురువారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపుతామన్నారు.