HYD: బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో నిన్న ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని శ్రీ రాధా గోవిందకు ప్రత్యేక అలంకారం చేశారు. శ్రీదేవి భూదేవి సమేత నరసింహ స్వామి కళ్యాణోత్సవం, పల్లకి ఉత్సవం భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది. HKM హైదరాబాద్ అధ్యక్షులు సత్య గౌర చంద్ర దాస్ ప్రభుజీ పాల్గొన్నారు.