• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చిన్నారికి అండగా మాజీ ఎమ్మెల్యే

NRPT: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ప్రసన్నను కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, చికిత్సకు తనవంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆపరేషన్ ఖర్చుల కోసం కూడా కృషి చేస్తానని తెలుపుతూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

March 22, 2026 / 07:33 PM IST

బ్రాహ్మణ కొత్తపల్లిలో వారంతపు అంగడి ప్రారంభం

MHBD: నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ఆదివారం వారంతపు అంగడిని ప్రారంభించినట్లు ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్, ఎస్సై రమేష్ బాబులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఆదివారం అంగడి నిర్వహించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ సంతాలో అన్ని రకాల సరుకులు దొరుకుతాయని సూచించారు.

March 22, 2026 / 07:32 PM IST

యుద్ధానికి వ్యతిరేకంగా వామపక్షాల ర్యాలీ

MBNR: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ శనివారం మహబూబ్‌నగర్‌లో వామపక్షాలు, ప్రజాసంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. యుద్ధం వల్ల నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, తక్షణమే దాడులు ఆపి చర్చలు జరపాలని CPM నేత పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, ‘యుద్ధం వద్దు-ప్రాణాలే ముద్దు’ అని నినదించారు.

March 22, 2026 / 07:30 PM IST

మాజీ సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు

TPT: మాజీ సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. మహిళల ఆస్తి హక్కుల అంశంపై జగన్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయం కుటుంబ వ్యవహారం మాత్రమే కాకుండా మహిళల హక్కులకు సంబంధించినదని పేర్కొన్నారు.

March 22, 2026 / 07:30 PM IST

కంభంలో కురుస్తున్న వర్షం

ప్రకాశం: కంభం పట్టణంలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల కాలంలో పట్టణంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదై, ఉక్కపోతకు అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో కొంత మేర ఉపశమనం పొందారు. అయితే ఉరుములు, మెరుపులు లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగలేదని స్థానిక ప్రజలు తెలిపారు.

March 22, 2026 / 07:30 PM IST

కోర్టు నూతన భవన నిర్మాణానికి భూమి పూజ

PPM: కోర్టుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని జిల్లా SP మాధవరెడ్డి అన్నారు. ఆదివారం ఎస్.కోటలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎన్. ప్రభాకర రెడ్డి కూడా పాల్గొన్నారు.

March 22, 2026 / 07:28 PM IST

APIIC భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. APIIC భూముల మ్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 51,603 ఎకరాల భూములను వెబ్ ల్యాండ్‌లో APIIC పేరుతో నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. APIIC ఆధీనంలోని 70 వేల ఎకరాల ప్రభుత్వ భూములను 22A నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

March 22, 2026 / 07:27 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

NGKL: చారకొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన రూ.1,57,000 విలువైన CMRF చెక్కులను కాంగ్రెస్ నాయకులు పొదిలి బాలరాజు ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

March 22, 2026 / 07:26 PM IST

ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఆదివారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటుచేసారు. ఈ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి సందర్శించారు. ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగ పరుచుకోవాలని వారు సూచించారు.

March 22, 2026 / 07:24 PM IST

సీఎం చిత్రపటానికి పాలభిషేకం

SRD: ఖేడ్ మండలం లింగాపూర్ గ్రామంలో రైతులు సీఎం చిత్రపటానికి పాలభిషేకం చేశారు. స్థానిక రైతు వేదికలో ఇవాళ జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారాన్ని రైతులు వీక్షించారు. ఇందులో రైతు భరోసా నిధులు విడుదలపై ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక రైతు వేదిక వద్ద రైతులు సంబరాలు జరుపుకున్నారు.

March 22, 2026 / 07:23 PM IST

శ్రీశైలంలో RTC డ్రైవర్‌పై దాడి..!

NDL: శ్రీశైలం శిఖరేశ్వరం వద్ద కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ దౌర్జన్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులు వరుసలో రావడంలేదని ప్రశ్నించిన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ చాంద్ భాషాను బలవంతంగా బస్సులో ఎక్కించి దోర్నాల వరకు దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఇవాళ కేసు నమోదు చేసి, డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు.

March 22, 2026 / 07:22 PM IST

అకాల వర్షాలతో రైతులకు భారీ నష్టం

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో టమోటా, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాలివీడు మండలంలో నష్టపోయిన తోటలను సీపీఐ నాయకులు పరిశీలించి, రైతులకు వెంటనే పరిహారం, పంట బీమా చెల్లింపులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

March 22, 2026 / 07:22 PM IST

కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

MNCL: జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఉన్న కస్తూరిబా బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేశారు. ఆదివారం ఆయన కిష్టాపూర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కస్తూరిబా పాఠశాలను సందర్శించి నిర్వాహకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆయన ఆదేశించారు.

March 22, 2026 / 07:21 PM IST

‘నిధుల వినియోగంలో పారదర్శకత తప్పనిసరి’

SKLM: ప్రభుత్వ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని జడ్పీ ఛైర్‌‌పర్సన్ విజయ అన్నారు. ఆదివారం జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు సూచించిన పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసి, నివేదికలను సిద్ధం చేయాలన్నారు. ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం ఉండరాదు అని పేర్కొన్నారు.

March 22, 2026 / 07:20 PM IST

రిటైర్డ్ ఉద్యోగులకు ఎమ్మెల్యే సన్మానం

విశాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఘన సన్మానం జరిగింది. పోర్ట్ యాదవ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదివారం శివాజీపాలెం సవేరా ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమం నిర్వహించారు. సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. ఉద్యోగ జీవితం ఒత్తిడిగా ఉంటుందని, ఇకపై కుటుంబంతో ఆనందంగా గడపాలని ఆయన అన్నారు.

March 22, 2026 / 07:19 PM IST