NGKL: పాలెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ Dr. పీ.శ్రీదేవి తెలిపారు. ఈ నెల 24న ఉదయం 9:30 గంటలకు వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై నమూనాల ప్రదర్శన, రైతులు-శాస్త్రవేత్తలకు చర్చా, ఆధునిక వ్యవసాయ యంత్రాల ప్రదర్శన ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
SRCL: కోనరావుపేట మండలంలోని కొండాపూర్ గ్రామం 7వ వార్డులో ఏళ్ల తరబడి నెలకొన్న మురుగునీటి సమస్య పరిష్కారానికి అడుగు పడింది. వార్డులోని నేవూరి దేవరాజు ఇంటి పరిసరాల్లో డ్రైనేజీ ఇబ్బందులను గమనించిన సర్పంచ్ వంకాయల గౌతమి, పాలకవర్గం స్పందించి, ఆదివారం కొత్త డ్రైనేజీ పైప్లాన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ అభివృద్ధికి, పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు.
NZB: ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం (2026-27) ఎన్నిక ఆదివారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ అధ్యక్షునిగా ముప్పారం శివకుమార్, కార్యదర్శిగా కత్రాజీ చిన్న గంగాధర్, గ్రామ అభివృద్ధి కమిటీకి శృంగారం మోహన్‌లను ఎన్నుకున్నారు.
ASR: డుంబ్రిగూడ మండలంలోని కురిడి రైల్వే గేట్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అరకులోయ నుంచి పాడేరు వైపు వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు అవతలికి దూసుకెళ్లి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహనదారులు నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తూనే, ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హెల్మెట్ ధరించడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.
కృష్ణా: అవనిగడ్డ మండలం పాత ఎడ్లంకలో ఆదివారం రాత్రి శ్రమ దినాల శిలువ మార్గం కార్యక్రమం జరిగింది. క్రైస్తవ సోదరులు ఏసు శిలువ మార్గం నిర్వహించారు. సీనియర్ నాయకులు మాదివాడ వెంకటకృష్ణ శిలువ మోశారు. ఆర్.సీ.ఎం చర్చి ప్రాంగణంలో రెవరెండ్ ఫాదర్ సురేష్ దీక్షదారులతో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రార్ధనలు చేశారు.
సత్యసాయి: హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు, పోస్టర్లు ఏర్పాటు చేయడం నిషేధం అని కమిషనర్ మల్లికార్జున ఆదివారం తెలిపారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా ప్రజా ప్రదేశాలు, రహదారులు, డివైడర్లు, విద్యుత్ స్తంబాలు, చెట్లు, ప్రభుత్వ భవన గోడలపై ఫ్లెక్సీలు లేదా బ్యానర్లు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధించామన్నారు.
NTR: తిరువూరు వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్స్, కో-ఆప్షన్ సభ్యులకు సన్మాన సభ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గత ఐదేళ్ల పాలన ముగియడంతో ఘనంగా శాలువాలతో నియోజకవర్గ ఇంఛార్జ్-నల్లగట్ల స్వామిదాస్ కౌన్సిలర్స్ సత్కరించారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ కోసమే పని చేసిన వారికి తగిన స్థానం ఎల్లప్పుడూ ఉంటుందని స్వామి దాస్ అన్నారు.
BDK: అశ్వారావుపేట నియోజకవర్గ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా రేపటి నుంచి ఆర్థిక సహాయం అందనుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద నియోజకవర్గంలో మొత్తం 45,456 మంది రైతులు లబ్ధి పొందుతూ, సుమారు రూ.25.39 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.
HYD: డబ్బు పోవడం ఈజీ.. కానీ రావడమే కష్టమని పెద్దలంటారు. వారి మాటలు ఇప్పటి రోజులకు సైతం వర్తిస్తాయి. డబ్బు అప్పుగా ఇస్తున్నారా..? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఓ ప్రైవేట్ సంస్థ ORR వరకు లోన్ రికవరీ సర్వేలో ఇచ్చిన అప్పులు ఎగ్గొట్టిపోయిన ఘటనలు 1250 పైగా నమోదయ్యాయి. HYDకు ఒక నెల ఒక దగ్గర ఉంటే మరో నెల ఎక్కడ ఉంటారో తెలియదని, ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంది.
TPT: శ్రీసిటీలోని డానియెలి ఇండియా లిమిటెడ్ సీఐఐ ఇండస్ట్రియల్ సేఫ్టీ అవార్డ్స్-2025లో గోల్డ్ అవార్డు అందుకుంది. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఉత్తమ భద్రతా ప్రమాణాలు, పని సంస్కృతి ఆధారంగా సీఐఐ నిపుణుల కమిటీ సంస్థను ఎంపిక చేసింది. ఈ అవార్డు సంస్థ భద్రతా నిబద్ధతకు నిదర్శనమని సీఓఓ పి.శ్రీనివాస్ రావు తెలిపారు.
TG: బీసీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప చేసిందేమీ లేదని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఏటా బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్ అన్నారని.. కానీ ఇప్పటివరకు రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్య, ఉద్యోగాల్లో బీసీల ప్రస్తావన లేదన్నారు.
SDPT: సిద్దిపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. 2027 జనాభా లెక్కల సేకరణపై జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సోమవారం ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని ఆమె కోరారు.
TPT: రేణిగుంట మండలం మామండూరులో మహిళపై హత్యాయత్నం జరిగింది. నైట్ షిఫ్ట్‌కు వెళ్తున్న మునెమ్మ (36)పై పి. కృష్ణమూర్తి అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడు కూడా గాయాలతో చికిత్సలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
KRNL: YCP పార్టీ నాయకులు, BJPలో కోవర్టులుగా ఉన్నవారు కావాలనే జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు రామస్వామిలపై తప్పుడు కేసులు నమోదు చేయించారని సుప్రీంకోర్టు అడ్వకేట్ పురుషోత్తంరెడ్డి అన్నారు. ఇవాళ ఓ గోల్డ్ సంస్థ వ్యవహారంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి CID విచారణ కోరనున్నట్లు తెలిపారు.