• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోడ్డు భద్రతపై పోలీసుల విస్తృత తనిఖీలు

ATP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహనదారులు నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తూనే, ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హెల్మెట్ ధరించడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.

March 22, 2026 / 08:00 PM IST

పాత ఎడ్లంకలో ఘనంగా శిలువ మార్గం

కృష్ణా: అవనిగడ్డ మండలం పాత ఎడ్లంకలో ఆదివారం రాత్రి శ్రమ దినాల శిలువ మార్గం కార్యక్రమం జరిగింది. క్రైస్తవ సోదరులు ఏసు శిలువ మార్గం నిర్వహించారు. సీనియర్ నాయకులు మాదివాడ వెంకటకృష్ణ శిలువ మోశారు. ఆర్.సీ.ఎం చర్చి ప్రాంగణంలో రెవరెండ్ ఫాదర్ సురేష్ దీక్షదారులతో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రార్ధనలు చేశారు.

March 22, 2026 / 08:00 PM IST

‘ఫ్లెక్సీలు, పోస్టర్లుకు అనుమతి తప్పనిసరి’

సత్యసాయి: హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు, పోస్టర్లు ఏర్పాటు చేయడం నిషేధం అని కమిషనర్‌ మల్లికార్జున ఆదివారం తెలిపారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా ప్రజా ప్రదేశాలు, రహదారులు, డివైడర్లు, విద్యుత్‌ స్తంబాలు, చెట్లు, ప్రభుత్వ భవన గోడలపై ఫ్లెక్సీలు లేదా బ్యానర్లు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధించామన్నారు.

March 22, 2026 / 08:00 PM IST

కౌన్సిలర్లను సన్మానించిన వైసీపీ ఇంఛార్జ్

NTR: తిరువూరు వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్స్, కో-ఆప్షన్ సభ్యులకు సన్మాన సభ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గత ఐదేళ్ల పాలన ముగియడంతో ఘనంగా శాలువాలతో నియోజకవర్గ ఇంఛార్జ్-నల్లగట్ల స్వామిదాస్ కౌన్సిలర్స్ సత్కరించారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ కోసమే పని చేసిన వారికి తగిన స్థానం ఎల్లప్పుడూ ఉంటుందని స్వామి దాస్ అన్నారు.

March 22, 2026 / 08:00 PM IST

‘రైతు భరోసాతో అండగా ప్రభుత్వం’

BDK: అశ్వారావుపేట నియోజకవర్గ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా రేపటి నుంచి ఆర్థిక సహాయం అందనుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద నియోజకవర్గంలో మొత్తం 45,456 మంది రైతులు లబ్ధి పొందుతూ, సుమారు రూ.25.39 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.

March 22, 2026 / 07:59 PM IST

డబ్బు అప్పుగా ఇస్తున్నారా..? జాగ్రత్త..!

HYD: డబ్బు పోవడం ఈజీ.. కానీ రావడమే కష్టమని పెద్దలంటారు. వారి మాటలు ఇప్పటి రోజులకు సైతం వర్తిస్తాయి. డబ్బు అప్పుగా ఇస్తున్నారా..? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఓ ప్రైవేట్ సంస్థ ORR వరకు లోన్ రికవరీ సర్వేలో ఇచ్చిన అప్పులు ఎగ్గొట్టిపోయిన ఘటనలు 1250 పైగా నమోదయ్యాయి. HYDకు ఒక నెల ఒక దగ్గర ఉంటే మరో నెల ఎక్కడ ఉంటారో తెలియదని, ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంది.

March 22, 2026 / 07:58 PM IST

డానియెలి సంస్థకు సీఐఐ గోల్డ్ అవార్డు

TPT: శ్రీసిటీలోని డానియెలి ఇండియా లిమిటెడ్ సీఐఐ ఇండస్ట్రియల్ సేఫ్టీ అవార్డ్స్-2025లో గోల్డ్ అవార్డు అందుకుంది. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఉత్తమ భద్రతా ప్రమాణాలు, పని సంస్కృతి ఆధారంగా సీఐఐ నిపుణుల కమిటీ సంస్థను ఎంపిక చేసింది. ఈ అవార్డు సంస్థ భద్రతా నిబద్ధతకు నిదర్శనమని సీఓఓ పి.శ్రీనివాస్ రావు తెలిపారు.

March 22, 2026 / 07:58 PM IST

బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోంది: శ్రీనివాస్ గౌడ్

TG: బీసీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప చేసిందేమీ లేదని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఏటా బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్ అన్నారని.. కానీ ఇప్పటివరకు రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్య, ఉద్యోగాల్లో బీసీల ప్రస్తావన లేదన్నారు.

March 22, 2026 / 07:52 PM IST

రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

SDPT: సిద్దిపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. 2027 జనాభా లెక్కల సేకరణపై జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సోమవారం ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని ఆమె కోరారు.

March 22, 2026 / 07:51 PM IST

మామండూరులో మహిళపై హత్యాయత్నం

TPT: రేణిగుంట మండలం మామండూరులో మహిళపై హత్యాయత్నం జరిగింది. నైట్ షిఫ్ట్‌కు వెళ్తున్న మునెమ్మ (36)పై పి. కృష్ణమూర్తి అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడు కూడా గాయాలతో చికిత్సలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

March 22, 2026 / 07:50 PM IST

సీఐడీ విచారణకు పురుషోత్తం డిమాండ్..!

KRNL: YCP పార్టీ నాయకులు, BJPలో కోవర్టులుగా ఉన్నవారు కావాలనే జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు రామస్వామిలపై తప్పుడు కేసులు నమోదు చేయించారని సుప్రీంకోర్టు అడ్వకేట్ పురుషోత్తంరెడ్డి అన్నారు. ఇవాళ ఓ గోల్డ్ సంస్థ వ్యవహారంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి CID విచారణ కోరనున్నట్లు తెలిపారు.

March 22, 2026 / 07:49 PM IST

‘ప్రజల్ని చైతన్యం చేయడానికి అరుణోదయ కృషి’

NZB: ప్రజల్ని చైతన్యం చేయడానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరుణోదయ మహాసభలను ఏప్రిల్ 10,11 తేదీల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

March 22, 2026 / 07:48 PM IST

‘ఐ లవ్ ఎల్విన్‌పేట’ బోర్డుతో చెరువు ముస్తాబు

PPM: గుమ్మలక్ష్మీపురం(మం) ఎల్విన్‌పేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న చెరువు ముస్తాబు పనుల్లో భాగంగా ‘ఐ లవ్ ఎల్విన్‌పేట’ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ప్రత్యేక లైటింగ్‌తో వెలుగుతూ.. గ్రామానికి కొత్త అందాన్ని తీసుకొచ్చింది. రాత్రి వేళల్లో ఇది ఆకర్షణీయంగా కనిపిస్తూ స్థానికులను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.

March 22, 2026 / 07:47 PM IST

‘నేటి యువతకు వారు ఆదర్శం’

KMM: భగత్ సింగ్ స్మారక యువజన ఉత్సవాలు జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఖమ్మం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశ స్వాతంత్ర సమరంలో యువతకు మార్గదర్శకులుగా నిలిచిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల ఆశలను నేటి యువత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం, లౌకికత్వం, సమానత్వం కోసం పోరాటం చేశారని తెలిపారు.

March 22, 2026 / 07:45 PM IST

తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ

AP సముద్ర జలాల్లోకి తమిళనాడు మత్స్యకారుల అక్రమ ప్రవేశంపై CM చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టాలని కోరుతూ TN సీఎం స్టాలిన్‌, కేంద్రానికి లేఖలు రాశారు. ఈ చొరబాట్ల వల్ల ఏపీలోని 162 గ్రామాల మత్స్యకారుల ఉపాధికి ముప్పు వాటిల్లి, ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య రాకముందే నిబంధనలపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు.

March 22, 2026 / 07:44 PM IST