• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు ఈ ప్రాంతల్లో కరెంట్ కట్

నిర్మల్ పట్టణ కేంద్రంలోని భాగ్యనగర్, గోదాం, ఎన్టీఆర్ మార్గ్, ఈద్గాం, ప్రాంతాలలో రేపు కరెంట్ నిలిపివేస్తున్నట్లు ఏడీ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. నూతన నియంత్రికలు ఏర్పాటు పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంట్ నిలిపి వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించగలరని కోరారు.

March 22, 2026 / 09:18 PM IST

రైతులకు చింతగూడ పీఏసీఎస్ సీఈవో సూచన

MNCL: జన్నారం మండలంలోని చింతగూడ పీఏసీఎస్ పరిధిలో ఉన్న రైతులు యూరియా బస్తాల కోసం యూరియా యాప్‌లో బుక్ చేసుకోవాలని పీఏసీఎస్ సీఈవో కావేటి రాజయ్య సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పీఏసీఎస్ పరిధిలోని రైతుల కోసం 266 యూరియా బస్తాలు వచ్చాయన్నారు. యాప్‌లో బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే వాటిని అందజేస్తామన్నారు. ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలని ఆయన కోరారు.

March 22, 2026 / 09:13 PM IST

త్వరలోనే కార్పొరేషన్ పదవులను భర్తీ: టీపీసీసీ చీఫ్

TG: ఆర్థిక సంక్షోభంలోనూ హామీలను అమలు చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దొడ్డు బియ్యం స్మగ్లింగ్ ద్వారా డబ్బులు కేసీఆర్ కుటుంబం జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. బీజేపీ నేతలు కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఏప్రిల్ నెలాఖరులో కార్పొరేషన్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు.

March 22, 2026 / 09:12 PM IST

సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్

ASR: డుంబ్రిగూడ(M) అమలగూడలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీపీఎం మండల నాయకులు, గసబ పంచాయతీ మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించి మాట్లాడుతూ.. సొవ్వ పంచాయతీ దేముడు వలస జంక్షన్ నుంచి అమలగూడ వరకు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. గతంలో కొంత మేర రోడ్డు నిర్మించి మిగతా భాగం వదిలేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

March 22, 2026 / 09:11 PM IST

‘టీడీపీ ప్రభుత్వం నగరిని నిర్లక్ష్యం చేసింది’

CTR: గత ప్రభుత్వ హయాంలో కరోనా కాలాన్ని మినహాయిస్తే మూడేళ్ల పాటు నగరిని ఎంతో అభివృద్ధి చేశారని మాజీ మంత్రి రోజా చెప్పారు. తన నివాసంలో పుత్తూరు మున్సిపల్ కార్యవర్గ సభ్యులకు ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు నగరిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

March 22, 2026 / 09:09 PM IST

పీడీఎస్యు పవన్ కుమార్‌పై కేసు నమోదు

WNP: కొత్తకోట మండలంలోని శివం కోచింగ్ సెంటర్లో యాజమాన్యాన్ని బెదిరించి పీడీఎస్యు సంఘం అధ్యక్షుడు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. కోచింగ్ సెంటర్ యాజమాన్యాన్ని బెదిరించి 30 వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు. మిగతా డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేయడంతో కోచింగ్ సెంటర్ యాజమాన్యం పోలీస్ స్టేషన్‌ను  సంప్రదించారు. దీంతో కొత్తకోట ఎస్సై ఆనంద్ కేసు నమోదు చేశామన్నారు.

March 22, 2026 / 09:06 PM IST

పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక

BDK: కొత్తగూడెం పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఆదివారం పద్మశాలి కళ్యాణమండపంలో ఎన్నికల కన్వీనర్ పుట్టా శంకరయ్య ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా ప్రసాద్ ఉపాధ్యక్షుడుగా ఉదయ్ కుమార్ కార్యదర్శిగా శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీగా మాధవ్ రావు ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ నూతన కమిటీతో సంఘం మరింత ముందుకు సాగాలని పెద్దలు కోరారు.

March 22, 2026 / 09:06 PM IST

‘శాకాహార మహా కరుణ’ ర్యాలీ

NZB: బాల్కొండ మండలం వన్నెల్ (బీ)లో పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో అహింసాహిత మహా కరుణ శాకాహార ర్యాలీని నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీని నిర్వహిస్తూ శాకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పీఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి జ్ఞానదాతగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంతటి ఉత్సాహంతో శాకాహార ర్యాలీలు నిర్వహించారన్నారు.

March 22, 2026 / 09:05 PM IST

రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల వేదిక

TPT: జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 23న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ అర్జీలను సమర్పించి సమస్యలకు పరిష్కారం పొందాలని కోరారు. Meekosam వెబ్‌సైట్,1100 ద్వారా కూడా ఫిర్యాదుల స్థితి తెలుసుకోవచ్చన్నారు.

March 22, 2026 / 09:05 PM IST

క్ష‌మాప‌ణ చెప్పిన‌ PCB ఛైర్మ‌న్‌ నఖ్వీ

పశ్చిమాసియా యుద్ధం పాకిస్తాన్ సూప‌ర్ లీగ్(PSL) పై ప్ర‌భావం చూపిస్తోంది. MAR 26 నుంచి ప్రారంభం కానున్న PSL ప్రేక్ష‌కులు లేకుండానే జ‌రగ‌నుంది. యుద్ధం కార‌ణంగా ప్రేక్షకులు రావడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో PCB ఛైర్మ‌న్ మోసిన్ న‌ఖ్వీ క్రికెట్ అభిమానుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాడు.

March 22, 2026 / 09:04 PM IST

నాతాళ్ల గూడెం వాసికి డాక్టరేట్

BHNG: వలిగొండ మండలం నాతాళ్ల గూడెంకు చెందిన జూకంటి వెంకటయ్యకు,OU రాజనీతి శాస్త్ర విభాగంలో చేసిన పరిశోధనకు PHD డాక్టరేట్‌ను ఆదివారం ప్రధానం చేశారు. OU సహ ఆచార్యులు డా.M.రమణ పర్యవేక్షణలో “ఏ రోల్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ గవర్నెన్స్, రూరల్ డెవలప్‌మెంట్: ఏ కేస్ స్టడీ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ” అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది.

March 22, 2026 / 09:01 PM IST

జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముమ్మర వాహన తనిఖీలు

కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. అమలాపురం పట్టణంలో ప్రధాన కూడళ్లలో ఎస్సైలు తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

March 22, 2026 / 09:00 PM IST

నూతన షెడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: చందర్లపాడు మండలం కోనాయిపాలెంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వరకుమార్ ఆధ్వర్యంలో సీఎస్ఐ చర్చిలో నిర్మించిన నూతన షెడ్డును ఆదివారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఎంతో అభినందనీయమని అన్నారు.

March 22, 2026 / 09:00 PM IST

రేపు అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన

BPT: మంత్రి గొట్టిపాటి రవికుమార్ 23న అద్దంకిలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, 10:30కు మున్సిపల్ కార్యాలయంలో దివ్యాంగులకు ఉచిత స్కూటీల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు చిలకలూరిపేట క్యాంపు కార్యాలయం వివరాలు వెళ్లడించింది.

March 22, 2026 / 09:00 PM IST

రూ.1.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభం

CTR: బొమ్మసముద్రంలో రూ.1.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీ మోహన్ ప్రారంభించారు. గ్రామం మోడల్ పంచాయతీగా మారుతుందని తెలిపారు. గ్రామంలో గోకులం షెడ్లు, సిమెంట్ రోడ్లు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ఆరోగ్య కేంద్రం వంటి అభివృద్ధి పనులను ప్రారంభించారు.

March 22, 2026 / 08:57 PM IST