• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కాంగ్రెస్‌ది దగాకోరు బడ్జెట్‌: మాజీ ఎమ్మెల్యే

BHNG: కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో దగాకోరు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా విమర్శించారు. తెలంగాణ ప్రజలను మరోసారి వంచించే బడ్జెట్‌ ఇది అని పేర్కొన్నారు. రేవంత్‌ సర్కార్‌ ఒంటెద్దు పోకడలతో నియంతలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భువనగిరి పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు.

March 23, 2026 / 06:16 AM IST

భద్రాచలానికి గోటి తలంబ్రాలు పంపిణీ

SDPT: భద్రాద్రి రామయ్య కళ్యాణం సందర్భంగా రాంసాగర్ రామాలయం నుంచి గోటి తలంబ్రాలు భద్రాచలానికి తరలించేందుకు సిద్ధం చేశారు. శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు సమకూర్చిన తలంబ్రాలను ఆదివారం రామరాజుకు అందజేశారు. భక్తితో సమర్పించిన ఈ తలంబ్రాలు రామయ్య సేవలో భాగం కావడం అదృష్టమన్నారు.

March 23, 2026 / 06:16 AM IST

ఘర్షణలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు..!

KRNL: కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఇటీవల జరిగిన ఘర్షణలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను ఆదివారం మండల అధ్యక్షులు చూడి సురేష్ నాయుడు పరామర్శించారు. కోసిగి రమేష్, అయ్యన్నల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ఇంఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి కూడా ఫోన్‌లో బాధితులను పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

March 23, 2026 / 06:16 AM IST

పోలీసులపై ఫిర్యాదుకు సిద్ధమైన మాజీ మంత్రి

GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబు సోమవారం గుంటూరు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో జరిగే PGRS కార్యక్రమానికి హాజరుకానున్నారు. తన ఇంటిపై జరిగిన దాడి, అరెస్ట్ సమయంలో పోలీసుల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తూ పూర్తి విచారణ కోరనున్నారు. ఈ పరిణామాలతో జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత మళ్లీ పెరిగింది.

March 23, 2026 / 06:15 AM IST

BRS ప్రైవేట్ బిల్లు.. BJP అసెంబ్లీ ముట్టడి

TG: రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ 6 గ్యారంటీల అమలుపై రాజకీయ సెగలు రేగనున్నాయి. గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టనుంది. మరోవైపు, ఇదే అంశంపై బీజేపీ ‘చలో అసెంబ్లీ’ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. సభ లోపల బిల్లులతో, బయట నిరసనలతో ఇవాళ రాష్ట్ర రాజకీయం హీటెక్కనుంది.

March 23, 2026 / 06:15 AM IST

పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం: ఎస్సై

BPT: యద్దనపూడిలో పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని ఎస్సై రత్న కుమారి తెలిపారు. ఆదివారం బహిరంగంగా మద్యం సేవిస్తున్న పలువురిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రజలు చట్టాలను పాటిస్తూ బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 23, 2026 / 06:14 AM IST

గరికపాటి వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

SRCL: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ధర్మ టీచర్ యూనియన్ (DTU), TPTF సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆదివారం వేములవాడలో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ నేతలు సంపతి రమేశ్, దూస సంతోశ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంపై మాట్లాడడం సరికాదన్నారు.

March 23, 2026 / 06:10 AM IST

నేడు మండలంలో వార్డ్ మెంబర్లకు శిక్షణ తరగతులు

KMM: కామేపల్లి మండల పరిధిలోని పంచాయతీ వార్డు మెంబర్లకు ఈరోజు నుంచి ఈనెల 28 వరకు శిక్షణ తరగతులను కామేపల్లి రైతు వేదికలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.రవీందర్, ఎంపీవో వీవీఎస్ శాస్త్రి తెలిపారు. 12 పంచాయతీలకు సంబంధించిన 114 మంది వార్డు మెంబర్లుకు తొలి విడతలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వార్డు మెంబర్లు సకాలంలో శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

March 23, 2026 / 06:10 AM IST

నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. హైఅలర్ట్

HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపు మేరకు ఇవాళ అసెంబ్లీని బీజేపీ నేతలు ముట్టడించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, పాలనలో అవినీతి, కమీషన్ల దందా పెరిగిపోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. నిరుద్యోగులు, రైతుల సమస్యల మీద ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు శ్రేణులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

March 23, 2026 / 06:09 AM IST

నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. హై అలర్ట్

HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపు మేరకు ఇవాళ అసెంబ్లీని బీజేపీ నేతలు ముట్టడించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, పాలనలో అవినీతి, కమీషన్ల దందా పెరిగిపోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. నిరుద్యోగులు, రైతుల సమస్యల మీద ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు శ్రేణులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

March 23, 2026 / 06:09 AM IST

‘తెలంగాణను తిరోగమనంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం’

PDPL: తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలోకి నెట్టిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధుకర్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్ అంకెల గారడీగా మారిందని, 6 గ్యారెంటీలకు నిధులు కోతపెట్టి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

March 23, 2026 / 06:08 AM IST

ధర్మారం వాసికి పద్మశాలి ఉగాది సేవా పురస్కారం

KNR: హైదరాబాద్‌లో జరిగిన పద్మశాలి- 2026 ఉగాది పురస్కారాల్లో జమ్మికుంట మండలం ధర్మారానికి చెందిన కందికట్ల పద్మకు సేవా అవార్డు అందించారు. ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. మహిళలకు టైలరింగ్ శిక్షణ, కాటన్ బ్యాగుల తయారీ, మహిళలకు ఉపాధి కల్పనలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు.

March 23, 2026 / 06:08 AM IST

కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

TG: అసెంబ్లీలో బడ్జెట్‌పై కీలక చర్చ జరగనుంది. ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లుతో పాటు బేవరేజెస్ కార్పొరేషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టనుంది. వీటితో పాటు పబ్లిక్ సర్వీసెస్ అపాయింట్‌మెంట్స్, ఉద్యోగుల పే స్ట్రక్చర్ సవరణ బిల్లులపై సుదీర్ఘ చర్చ జరగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు జరగనున్నాయి.

March 23, 2026 / 06:05 AM IST

ఈ నెల 25 న మంచినీటి రక్షణపై శిక్షణ

VZM: ఈ నెల 25న AP SIRD ఆదేశాల మేరకు గంట్యాడ మండల పరిధిలోని MPTCలు, సర్పంచ్‌లు, వార్డ్‌ మెంబర్లకు గ్రామ స్థాయిలో మంచి నీటి రక్షణపై శిక్షణ ఇస్తున్నట్లు స్థానిక MPDO ఆర్‌వీ.రమణమూర్తి తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆరోజు తమ కార్యాలయంలోనే ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని, మండల పరిధిలో ఉన్న సర్పంచ్‌లు, MPTC, వార్డు మెంబర్లు హాజరుకావాలన్నారు.

March 23, 2026 / 06:04 AM IST

ఛలో అసెంబ్లీ’కి బీజేవైఎం పిలుపు

NRPT: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఇవాళ బీజేపీ చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ని జయప్రదం చేయాలని బీజేవైఎం నారాయణపేట జిల్లా కార్యదర్శి బద్రి పిలుపునిచ్చారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమానికి కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు.

March 23, 2026 / 06:04 AM IST