BHNG: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో దగాకోరు బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా విమర్శించారు. తెలంగాణ ప్రజలను మరోసారి వంచించే బడ్జెట్ ఇది అని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ ఒంటెద్దు పోకడలతో నియంతలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భువనగిరి పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు.