PDPL: తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలోకి నెట్టిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధుకర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్ అంకెల గారడీగా మారిందని, 6 గ్యారెంటీలకు నిధులు కోతపెట్టి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.