• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శునకానికి వెన్నెముక సర్జరీ

SRPT:  కోదాడ ప్రాంతీయ వైద్యశాలలో ఆదివారం శునకానికి విజయవంతంగా వెన్నెముక సర్జరీ నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ డా.పీ.పెంటయ్య మాట్లాడుతూ.. నందిగామకు చెందిన జంతు ప్రేమికుడు శామ్యూల్ పెంపుడు శునకానికి యాక్సిడెంట్‌లో గాయాలపాలవ్వగా యజమాని వైద్యం కోసం కోదాడ ప్రాంతీయ వైద్యశాలకు తీసుకొచ్చినట్లు వివరించారు.

March 23, 2026 / 06:03 AM IST

పట్టణ శివారులో వాహనాల తనిఖీలు

WNP: ఆత్మకూరు పట్టణ శివారులో ఎస్సై జయన్న ఆధ్వర్యంలో ఆదివారం విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 23, 2026 / 06:02 AM IST

స్విమ్మింగ్ పూల్లో పడి మాజీ సైనికుడి మృతి

 NLG: కట్టంగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బెల్లి జనార్ధన్ (50) ఆదివారం సాయంత్రం కట్టంగూరులోని ఒక స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లారు. నీటిలో ఈత కొడుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

March 23, 2026 / 06:01 AM IST

పుడమిపుత్ర జాతీయ అవార్డుకు గంగారం ఎంపిక

NZB: సాలూరకు చెందిన రైతు గంగారాం వ్యవసాయంలో వినూత్న పద్ధతులు, రైతు సమస్యలపై పోరాటం వల్ల పుడమిపుత్ర జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. 35 ఏళ్లుగా వరి, చెరుకు, కూరగాయలు, మామిడి, జామ పంటలు సాగు చేస్తున్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుంటారు. ఈనెల 26న హైదరాబాద్‌లో ఆయనకు అవార్డు ఇవ్వనున్నారు. జాతీయ పురస్కారానికి ఎంపిక చేసిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.

March 23, 2026 / 06:01 AM IST

వజ్రకరూరు ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలు

ATP: వజ్రకరూరు మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు 200 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 150 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

March 23, 2026 / 06:01 AM IST

లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

JGL: ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ఆదివారం మొత్తం రూ. 4,00,907 ఆదాయం లభించింది. టికెట్ల ద్వారా రూ. 2,12,109, ప్రసాదాల ద్వారా రూ. 1,44,940, అన్నదానం ద్వారా రూ. 43,858 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి ఆలయ ఆదాయం పెరిగిందని చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు.

March 23, 2026 / 05:59 AM IST

RAIN ALERT: నేడు రాష్ట్రంలో వర్షాలు

AP: రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరులో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడవచ్చు. నెల్లూరు, ప్రకాశం, పల్నాడులో తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఉరుములు వస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద ఉండరాదని అధికారులు ప్రజలను హెచ్చరించారు.

March 23, 2026 / 05:58 AM IST

నాలుగు జిల్లాల్లో కూలీ పని రికార్డు

NRML: ఉమ్మడి జిల్లాల్లో గ్రామీణులకు ఉపాధి హామీ పథకంలో కూలీల పని దినాలు రాష్ట్రంలో పలు జిల్లాల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్ 92%, ఆసిఫాబాద్ 91.8%, మంచిర్యాల 89.4%, నిర్మల్ 87.4% సాధనతో లిస్టులో ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే నాలుగు జిల్లాలు మరింత మెరుగ్గా ప్రదర్శించాయి.

March 23, 2026 / 05:52 AM IST

40 ఏళ్ల బస్టాండ్.. నేటి రద్దీకి సరిపోదు

MNCL: చెన్నూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ 40 ఏళ్ల క్రితం నిర్మాణమే నేటి సమస్యలకు కారణమైంది. అప్పటి అవసరాలకు సరిపోయిన ఈ ప్రాంగణం, ప్రస్తుతం పెరిగిన రూట్లు, వేలాది ప్రయాణికుల రద్దీకి తట్టుకోలేక ఇబ్బందులు కలిగిస్తోంది. సరైన సౌకర్యాలు లేక ప్రయాణికులు చెట్ల కింద, హోటళ్ల వద్ద వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. కొత్త బస్టాండ్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

March 23, 2026 / 05:47 AM IST

వేషనాగమ్మ కథతో అలరించిన కళాకారులు

NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలోని దేవి నగర్లో నిర్వహిస్తున్న శ్రీ కాళికాదేవి జాతర మహోత్సవాల్లో భాగంగా కళాకారులు వేషనాగమ్మ జానపద కథపై ఆకట్టుకునే ఆటను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో నాగమ్మ పాత్రలో కళాకారిణి తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించగా, కథలోని తెలివితేటలు, నైతిక విలువలను హృద్యంగా ప్రతిబింబించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై కళాకారులను అభినందించారు.

March 23, 2026 / 05:42 AM IST

‘విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలి’

AKP: మాజీ మంత్రి దివంగత గుడివాడ గుర్నాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం మాట్లాడుతూ.. కొందరు దుండగులు అల్లర్లు సృష్టించేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

March 23, 2026 / 05:41 AM IST

కోహెడ భూ బాధితులకు ఈటల అండ

TG: ‘పేదల భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోం’ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పట్టా భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. భూ బాధితుల ధర్నాకు మద్దతు పలికిన ఆయన, పేదల హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

March 23, 2026 / 05:40 AM IST

మధురానగర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం

KNR: గంగాధర మండలం మధురానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో రూ. 10 లక్షల EGS నిధులతో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ వేముల భాస్కర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తూము రాజు కుమార్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నిధులు అడగగానే కేటాయించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సర్పంచ్ వేముల భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.

March 23, 2026 / 05:39 AM IST

నేటి నుంచి కోదండ రామాలయంలో కల్యాణోత్సవాలు

శ్రీకాకుళం నగరం పాల కొండ రోడ్డులోని కోదండ రామాలయంలో సోమవారం నుంచి కోదండ రాముడి కల్యాణోత్సవాలు, శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్నట్లు అర్చకులు బంకుపల్లి శేషాచార్యులు తెలిపారు. 27న శ్రీరామ చంద్ర మూర్తి కల్యాణం, 29న వార్షిక కల్యాణం, 31న రథోత్సవం, ఏప్రిల్ 2న పట్టాభిషేకం, 3న పుష్పయాగ మహోత్సవం జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

March 23, 2026 / 05:27 AM IST

‘మళ్లీ పెళ్లి చేసుకుంటాను.. కానీ!’

తన రెండో పెళ్లిపై వస్తున్న ప్రశ్నలకు నిహారిక కొణిదెల సమాధానం ఇచ్చింది. భవిష్యత్తులో తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, అయితే ప్రస్తుతం దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదని తెలిపింది. ఈ క్రమంలో SM ట్రోల్స్‌పై ఆమె తీవ్రంగా స్పందించింది. అసభ్యకరంగా ప్రవర్తించే వారికి శిక్ష పడితేనే ఇతరులకు భయం వస్తుందని, అది లేకపోవడం వల్లే కొందరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడింది.

March 23, 2026 / 05:20 AM IST