ATP: వజ్రకరూరు మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు 200 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 150 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.