MDCL: అల్వాల్ పట్టణ పరిధి మచ్చ బొల్లారంలోని సర్వేశ్వరుని గుట్ట సర్వేశ్వరాలయంలో ఆదివారం గో ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గోసేవ శిక్షణ వర్గ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచగవ్య వినియోగం, గో ఉత్పత్తుల తయారీ, టెర్రస్ గార్డెనింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడవెల్లి శ్రీనివాస్, యతేంద్ర, మనోజ్ తదితరులు ఉన్నారు.
SKLM: ఆమదాలవలస(మం) నెల్లిపర్తిలో సన్‌రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. డా.బొడ్డేపల్లి సురేష్ పర్యవేక్షణలో సుమారు 250 మందికి బీపీ, షుగర్, కీళ్ల వాతం, థైరాయిడ్, గుండె సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్ జ్వరాలు, వడదెబ్బ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
VZM: ఎస్.కోట పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ దామోదర్ ఆదివారం సందర్శించారు. సీడీ ఫైల్స్, లాకప్ రూమ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు స్టేషన్ సిబ్బంది గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీ.ఎస్.పీ గోవిందరావు, సీఐ వీఎన్ మూర్తి పాల్గొన్నారు.
మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ కొండగట్టుకు పాదయాత్ర చేస్తూ బయలుదేరారు. ధరణి మధుకర్ ఇటీవల హనుమాన్ దీక్షను స్వీకరించారు. దీంతో ఆదివారం ఆయన హనుమాన్ భక్తులతో కలిసి పాదయాత్రగా కొండగట్టుకు బయలుదేరి వెళ్లారు. అంతకు ముందు స్థానిక దేవాలయాల్లో మేయర్ మధుకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా దేవాలయాల నిర్వాహకులు ఆయనను సన్మానించారు.
VSP: ఈస్ట్ కోస్ట్ రైల్వే 275 మిలియన్ టన్నుల సరుకు లోడింగ్ లక్ష్యాన్ని గడువుకు 11 రోజుల ముందే చేరుకుని కొత్త రికార్డు సృష్టించిందని డీఆర్‌ఎం లలిత్ బోరా ఆదివారం తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 10.4% వృద్ధి నమోదు చేసింది. మార్చి 21 నాటికి 250 మిలియన్ టన్నుల అన్‌లోడింగ్‌ను కూడా పూర్తి చేసి మరో మైలురాయిని సాధించింది.
ASR: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రకటించిన జాబ్ కేలండర్‌లో ఆదివాసీ నిరుద్యోగుల ప్రస్తావన లేకపోవడం శోచనీయమని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ అన్నారు. ఆదివారం అరకులో మాట్లాడుతూ.. జాబ్ కేలండర్ 10,060 ఉద్యోగాల్లో ఆదివాసీలకు ఉపాధ్యాయ, ఉద్యోగ నియామకాల ప్రస్తావన లేదన్నారు. ఆదివాసీలకు 100శాతం రిజర్వేషన్ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ADB: తెలంగాణ రైతాంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు సరైనది కాదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న అర్లీ(బి) గ్రామానికి చెందిన తుడం గణపతి కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు ముందు ప్రభుత్వానికి రైతు తన ఆవేదన వ్యక్తం చేసిన పట్టించుకోలేదని తెలిపారు.
NLG: మహాత్మ జ్యోతిబా పూలే, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతుల సందర్భంగా కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు. ఈనెల 28న నల్లగొండలో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కృష్ణా: ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో ఆదివారం ఉదయం అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి వచ్చామని చెప్పుకున్న కొంతమంది స్వామీజీలు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇంటికి చేరుకుని డబ్బులు డిమాండ్ చేశారు. కోరిన మొత్తాన్ని ఇవ్వకపోతే శపిస్తామని ఇంట్లో ఉన్న వృద్ధ మహిళను బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.
ELR: ద్వారకాతిరుమల మండలం పావులవారిగూడెం గ్రామ పరిధిలో ఇటీవల జరిగిన గేదెల దొంగతనం కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. CC ఫుటేజ్ ఆధారంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గేదెలను దొంగలించిన వారిని అరెస్ట్ చేసినట్లు ద్వారకాతిరుమల SI T. సుధీర్ ఆదివారం తెలిపారు. మిడతా వెంకన్న, కడారి కృష్ణ, కడారి సురేష్, ఉప్పాటి సుబ్రహ్మణ్యంలను అరెస్ట్ చేశామన్నారు.
VZM: ఎస్. కోట శ్రీనివాస కాలనీలో ఎమ్మెల్యే లలిత కుమారి ఆదివారం పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈనెల 23న అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
వనపర్తి మండలం చిట్యాలలో అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా మిషన్ భగీరథ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది ఐక్య రాజ్య సమితి ప్రకటించిన “నీరు, లింగ సమానత్వం” (Water and Gender) థీమ్‌పై సాంస్కృతిక సారధి కళాబృందం పాటల ద్వారా అవగాహన కల్పించారు. నీటిని ఆదా చేస్తూ, మహిళా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు ‘AA22 X A6’. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కీలక పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక, మృనాల్ ఠాకూర్, జాన్వి కపూర్ వంటి హీరోయిన్లు కూడా కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.
KNR: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన సూత్రపు అనిల్ (27) తన తల్లి స్వరూప (55)తో కలిసి బైక్‌పై వెళ్తుండగా అంబాల్పూర్ కొత్త బ్రిడ్జి వద్ద వారిని గూడ్స్ ఆటో ఢీట్టింది. ఈ ఘటనలో అనిల్‌కు ఎడమ కాలికి గాయం కాగా, స్వరూపకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది వారికి ప్రథమ చికిత్స అందించి, హాస్పిటల్‌కి తరలించారు.
అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న స్టీల్ ప్లాంట్ రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ సూర్యచంద్ర అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 55 వేల ఉద్యోగాలు కలుగుతాయని తెలిపారు. ఈ నెల 23న శంకుస్థాపన జరగనుండగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.