MHBD: గంగపుత్ర సంఘం తొర్రూరు మండల నూతన కమిటీని ఆదివారం గంగపుత్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం మండల అధ్యక్షుడిగా సింగారం కిరణ్ కుమార్, కార్యదర్శిగా గంగాధర యాకంభ్రంలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగపుత్ర సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని, సంఘం అభివృద్ధి కోసం గంగపుత్రులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
SDPT: గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS) పార్టీ ఇంఛార్జ్ ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశంలో పామాయిల్ సాగు, సంబంధిత ఫ్యాక్టరీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నర్మెటలో ఏర్పాటు చేసిన భారీ పామాయిల్ ఫ్యాక్టరీని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్ రావుల కృషితో పూర్తైన ఫ్యాక్టరీని నేడు కాంగ్రెస్ చేసినట్లు కలర్ ఇస్తుందన్నారు.
KRNL: ఓర్వకల్ గ్రామంలో ఉన్న ఓ బైక్ మెకానిక్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మెకానిక్ షాప్‌లో ఆకస్మికంగా మంటలు చేలరేగాయి. దీంతో 18 ద్విచక్ర వాహనాలు మంటలు అంటుకుని ఆహుతి అయినట్లు స్థానికులు తెలిపారు. దాదాపుగా రూ. 400,000 ఆస్తి నష్టం సంభవించినట్టు షాపు యజమాని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRCL: వేములవాడలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) కార్యవర్గం నియామకం జరిగింది. వేములవాడ (IVF) పట్టణ అధ్యక్షునిగా జవ్వాజి సంపత్ ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షుడు నూకల శ్రీనివాస్ ప్రకటించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు వైశ్య సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు, సంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
W.G: రైతు ఆదాయాన్ని పెంచి, ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండటమే ప్రభుత్వ సంకల్పమని నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు అన్నారు. ఆదివారం నరసాపురం మండలం మోడీ గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – మూడో విడత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి అన్నదాత సుఖీభవ పథకంపై ప్రచారం నిర్వహించారు.
AP: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఏపీ ఆక్వా రంగాన్ని దెబ్బతీసింది. పాలిమర్ కొరతతో ప్యాకింగ్ ఖర్చులు పెరిగాయంటూ ఎగుమతిదారులు రైతుల వద్ద కేజీకి రూ.10 తగ్గించి కొంటున్నారు. దీంతో ఉమ్మడి ప.గో. రైతులకే రోజూ రూ.75 లక్షల నష్టం వాటిల్లుతోంది. ఎక్స్ పోర్టర్లు సిండికేట్‌గా మారి దోచుకుంటున్నారని, ప్రభుత్వం పట్టించుకోట్లేదని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
MNCL: కోటపల్లి మండలం కాలేశ్వరం నుంచి బెల్లంపల్లి వెళ్లే బైక్ బోరంపల్లి వద్ద ఆదివారం బైక్ అదుపుతప్పి కింద పడింది. బెల్లంపల్లికి చెందిన జీదుల రాజ్ కుమార్, సరిత తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. 108కు ఫోన్ చెయ్యగా కోటపల్లి 108 సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
SRPT: అనంతగిరి మండలం అజ్నీర తండా గ్రామంలో MGNREGS నిధులు సుమారు రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ శ్రీవిద్య ఈరోజు శంకుస్థాపన చేశారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కొరకై గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా సహకరించాలని సర్పంచ్ కోరారు.
WNP: ఈనెల 23న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు డీ.నారాయణ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను వంచిస్తోందని, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి బీజేపీ శ్రేణులు భారీగా తరలిరావాలని ఆయన కోరారు.
అన్నమయ్య: జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ఈనెల 23న సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీలు వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని, వివరాల కోసం 1,100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
KNR: శంకరపట్నం మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన రైతు సంఘం మహాసభలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా పాత పంపిణీ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు
NZB: ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై ఉన్న నవనాథ సిద్ధేశ్వర దేవాలయం అన్న ప్రసాదానికి సిద్ధేశ్వర పిరమిడ్ కమిటీ ఛైర్మన్ తిరుమల గంగారాం ఆలయ కమిటీ సభ్యులకు ఆదివారం రూ.16,101 విరాళం అందజేశారు. ఈనెల 27న సీతారాముల కళ్యాణం కోసం విరాళం అందజేసినందుకు కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
HNK: NIT వరంగల్‌లో హిటాచీ ఎనర్జీ ఇండియా సహకారంతో INNOTHON 3.0 హ్యాకథాన్ ప్రారంభమైంది. 28 జట్లకు చెందిన 127 మంది విద్యార్థులు పాల్గొని, 36 గంటల పాటు ఎనర్జీ ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ, రియల్ వరల్డ్ సమస్యల పరిష్కారాలపై ఆలోచనలు అభివృద్ధి చేస్తున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుంది.
JN: రాఘవపురం గ్రామానికి చెందిన యువకుడు P. రాకేష్ కార్తికేయ(పూజారి రాజు) దర్శకత్వంలో పాలకుర్తి యువత తీసిన ‘ఒక ఫోటో ప్రేమ కథ’ అనే షార్ట్ ఫిలింను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలని, పాలకుర్తి ప్రాంతాల్లోని నటీ, నటులకు అండగా ఉంటామన్నారు.
NRPT: మద్దూర్ మున్సిపల్ పరిధిలోని బీంపూర్‌లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే బీఆర్ఎస్ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ అని కొనియాడారు. రాబోయే రెండేళ్లలో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.