KMM: తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో ఖమ్మం స్వర్ణభారతి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను మేయర్ పునకొల్లు నీరజ ప్రారంభించారు. ప్రముఖ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్న ఈ వేదిక విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరమని ఆమె తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సుల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
మట్టి కుండలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతిగా దాహం వేయదు. ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. శరీరం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. డిహైడ్రేట్‌కు గురికారు. జీర్ణసంబంధిత సమస్యలు దూరమవుతాయి. జలుబు, దగ్గు తగ్గుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.
TPT: లేబర్ కోడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని వరదయ్యపాలెం డీవీఎంసీ మెంబర్ గుత్తి త్యాగరాజు డిమాండ్ చేశారు. 12 గంటల పని విధానంపై వస్తున్న ప్రచారాలు కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని, అధిక పని గంటలు చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇది కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. కార్మిక హక్కులను కాపాడాలని, ఉల్లంఘించే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
MNCL: దేశంలో బీజేపీ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు సికందర్ ఆరోపించారు. ఆదివారం జైపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈనెల 23 నుంచి 30 వరకు జరగనున్న భగత్ సింగ్, రాజ్ గురు, సుక్ దేవ్ 95వ వర్ధంతి సభల పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయి, మాదక ద్రావ్యాల మత్తులో ఉన్నారని తెలిపారు.
TG: కనీస మద్దతు ధరతో పాటు వరికి బోనస్ కూడా ఇస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అవసరం ఎక్కువ ఉన్న పంటలకు బోనస్ ఇచ్చి ప్రోత్సహించాలనేది సీఎం ఆలోచన అని చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రిఫైనరీని కూడా సిద్ధిపేట జిల్లాలోనే నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇదే వేదిక పైనుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు.
MDCL: ఘట్‌కేసర్, పోచారం, అన్నోజిగూడ, సింగపూర్ టౌన్షిప్ ఏరియాల్లో నివాసం ఉంటున్న గ్యాస్ వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ బుక్ చేసిన 15 నుంచి 20 రోజుల తర్వాత డెలివరీ అవుతున్నట్లుగా తెలిపారు. మార్చి మొదటి వారంలో బుక్ చేసిన వారికి ఇటీవలే గ్యాస్ డెలివరీ జరిగింది. డెలివరీ ఆలస్యం జరుగుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో జడ్పీ ఛైర్మన్ అధ్యక్షతన స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ఆదివారం ఈ సమావేశంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో పీఎసీఎస్‌లలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు.
ATP: తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారు భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని రంగురంగుల పుష్పాలు, పట్టువస్త్రాలతో అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకను తిలకించేందుకు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సెంటర్లో ఇవాళ సీఐటీయు నాయకులు నరసింగరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సిమెంటు పరిశ్రమలలో భూములు కోల్పోయిన వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని సీఐటీయు నాయకులు డిమాండ్ చేశారు. పరిశ్రమలలో భూ బాధితులకు ఉద్యోగాలు కల్పించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.
NTR: ఇబ్రహీంపట్నంలో రౌడీ షీటర్లకు సీఐ సుబ్రహ్మణ్యం హెచ్చరిక జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కౌన్సిలింగ్‌లో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. సత్ప్రవర్తనతో మెలిగి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని తెలిపారు. మార్పు లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
TG: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించారు. 62 ఎకరాలపైగా విస్తీర్ణంలో రూ.300 కోట్లతో అయిల్‌పామ్ ఫ్యాక్టరీని నిర్మించారు. నర్మెట్టలో రూ.80 కోట్లతో నిర్మించే వంటనూనె రిఫైనరీకి శంకుస్థాపన చేశారు.
PLD: అమరావతి(M) ఎండ్రాయిలో పిడుగుపాటుకు ఓ పాడి రైతు బలయ్యాడు. గ్రామానికి చెందిన విజయ్ కుమార్ శనివారం సాయంత్రం గేదెలను మేపేందుకు పొలానికి వెళ్లగా, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా.. గట్టుపై పిడుగు పడి విజయ్ మృతి చెంది ఉండటం గమనించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) గ్రామంలో ఆదివారం సర్పంచ్ చౌహన్ డిగంబర్ చలి వేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సక్రు, అగన్, గ్రామస్థులు పాల్గొన్నారు.
NLG: జనగణనలో బీసీ కులగణన చేపట్టాలనే ప్రధాన డిమాండ్‌తో ఢిల్లి లోని జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే దురంతో ఎక్స్‌ప్రెస్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జండా ఊపి ప్రారంభించారు. కొన్ని దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగణను చేపట్టాలని కోరారు.
SDPT: బెజ్జంకి మండలం తిమ్మాయపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని పోతారాజుల విన్యాసాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించారు. గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామస్థులు పాల్గొన్నారు.