• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చలి వేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) గ్రామంలో ఆదివారం సర్పంచ్ చౌహన్ డిగంబర్ చలి వేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సక్రు, అగన్, గ్రామస్థులు పాల్గొన్నారు.

March 22, 2026 / 04:30 PM IST

జనగణలో బీసీ కుల గణన చేపట్టాలి: బీసీ జేఏసీ

NLG: జనగణనలో బీసీ కులగణన చేపట్టాలనే ప్రధాన డిమాండ్‌తో ఢిల్లి లోని జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే దురంతో ఎక్స్‌ప్రెస్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జండా ఊపి ప్రారంభించారు. కొన్ని దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగణను చేపట్టాలని కోరారు.

March 22, 2026 / 04:30 PM IST

బెజ్జంకిలో పోచమ్మ బోనాలు

SDPT: బెజ్జంకి మండలం తిమ్మాయపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని పోతారాజుల విన్యాసాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించారు. గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామస్థులు పాల్గొన్నారు.

March 22, 2026 / 04:30 PM IST

సీఎం సభకు తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు

సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సభకు హుస్నాబాద్ చెందిన రైతులు, నాయకులు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ బూరుగు లత కృష్ణ స్వామి, 10వ వార్డ్ కౌన్సిలర్ సావుల మంజుల, మాలపల్లె గ్రామ సర్పంచ్ వెన్న స్వర్ణలత -రాజు, సావుల వెంకటస్వామి, బూరుగు సతీష్, నల్వాల ఆనందం తదితరులు పాల్గొన్నారు.

March 22, 2026 / 04:29 PM IST

వడ్డాదిలో స్కౌట్స్ గైడ్స్ శిక్షణ

AKP: వడ్డాదిలో విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒరియెంటేషన్ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఏపీజేఏసీ కన్వీనర్ వీవీ రామరాజు ఆధ్వర్యంలో స్వామి నాయుడు శిక్షణ అందించారు. క్రమశిక్షణ, నాయకత్వం, సేవాభావం, సామాజిక సేవ, ప్రథమ చికిత్స వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఇతరులకు సహాయం చేసే విధానాలు కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు రాంబాబు, వరప్రసాద్ పాల్గొన్నారు.

March 22, 2026 / 04:25 PM IST

‘ప్రజా సంక్షేమ పథకాలను గడపగడపకూ చేరవేయాలి’

MDK: జిల్లాలోని రామాయంపేట పట్టణంలో నిర్వహించిన ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ’ ప్రశిక్షణ కార్యక్రమంలో మూడు జిల్లాల బీజేపీ ఇంఛార్జ్ రంజిత్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..​ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసి, పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

March 22, 2026 / 04:25 PM IST

రేపు రేషన్ కార్డుదారులకు కిరోసిన్..!

W.G: గ్యాస్ కొరత నేపథ్యంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం రేపటి నుంచి లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి 2,800 కిలో లీటర్ల కిరోసిన్‌ను అందించిన విషయం తెలిసిందే. సంక్షోభ పరిస్థితుల కారణంగా మళ్లీ సరఫరా చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

March 22, 2026 / 04:24 PM IST

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

SKLM: పోలాకి(మం), రేవు అంపలాం గ్రామంలో యోగి బ్రదర్స్ వారి ఇంట జరిగిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు పండగలకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదివారం హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

March 22, 2026 / 04:24 PM IST

‘జిల్లాలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించాలి’

KRNL: జిల్లాలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించి, ప్రజలు ఇండక్షన్ స్టవ్, సోలార్, ఎలక్ట్రిక్ కుక్కర్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించేలా చూడాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి LPG గ్యాస్ అంశంపై డివిజన్, మండలస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ సూచనలు చేశారు.

March 22, 2026 / 04:23 PM IST

విగ్రహ ప్రతిష్టాపనకు ఎంపీకి ఆహ్వానం

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ మాదారం గ్రామంలో పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావును ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, బీజేపీ నాయకులు కలిసి పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు.

March 22, 2026 / 04:22 PM IST

వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం

SRCL: తంగళ్ళపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో వార్డు సభ్యులకు ఆదివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేయడంలో వార్డు సభ్యుల పాత్ర చాలా కీలకమన్నారు. ప్రతి వార్డు సభ్యుడు గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో మీర్జా, వార్డు సభ్యులు కీర్తన, పద్మ తదితరులు పాల్గొన్నారు.

March 22, 2026 / 04:20 PM IST

’27న సీతారాముల కళ్యాణం వేడుకలు’

MBNR: మిడ్జిల్ మండలం వెలుగోముల గ్రామంలో ఈనెల 27న శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఆదివారం సర్పంచ్ సువర్ణమ్మ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. కళ్యాణం, అన్నదాన ఖర్చులను కటికి నిరంజన్ భరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

March 22, 2026 / 04:20 PM IST

ఈనెల 27న వరంగల్‌లో ‘హిందూ సంకల్ప యాత్ర బైక్ ర్యాలీ’

WGL: BJP రాష్ట్ర అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ ఈనెల 27న నగరానికి రానున్నట్లు హిందూ సేవా సమితి అధ్యక్షులు నాగపురి వెంకటేష్ తెలిపారు. శ్రీరామనవమి సందర్బంగా నిర్వహించే ‘హిందూ సంకల్ప యాత్ర బైక్ ర్యాలీ’లో ఆయన పాల్గొంటారన్నారు. KZP కడిపికొండ బ్రిడ్జి వద్ద ఈ ర్యాలీ ప్రారంభమై WGLచౌరస్తా వరకు జరుగుతుందని, అనంతరం ముగింపు సభ ఉంటుందని, విజయవంతం చేయాలని కోరారు.

March 22, 2026 / 04:20 PM IST

ఎంపీ బీదాపై మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు

NLR: తమిళనాడుకు చెందిన బోట్లను ఆంధ్రా మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే టీడీపీ నేతలు వాటిని దొంగచాటుగా వదిలేశారని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. స్వార్ధ రాజకీయాల కోసం టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు ఈ పని చేశారని ఆరోపించారు. మత్స్యకారుల సంక్షేమం మీద టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు.

March 22, 2026 / 04:20 PM IST

జాబ్ క్యాలెండర్‌తోనే ఉజ్వల భవిష్యత్తు: పెంకే బాబా

KKD: రాష్ట్ర యువత ఉజ్వల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా తెలిపారు. ఆదివారం కాకినాడ రూరల్ 48, 49 వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ ద్వారా మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

March 22, 2026 / 04:20 PM IST