• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఐవీఎఫ్ కార్యవర్గం నియామకం

SRCL: వేములవాడలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) కార్యవర్గం నియామకం జరిగింది. వేములవాడ (IVF) పట్టణ అధ్యక్షునిగా జవ్వాజి సంపత్ ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షుడు నూకల శ్రీనివాస్ ప్రకటించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు వైశ్య సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు, సంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

March 22, 2026 / 06:17 PM IST

రైతు సంతోషమే ప్రభుత్వం లక్ష్యం: రామరాజు

W.G: రైతు ఆదాయాన్ని పెంచి, ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండటమే ప్రభుత్వ సంకల్పమని నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు అన్నారు. ఆదివారం నరసాపురం మండలం మోడీ గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – మూడో విడత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి అన్నదాత సుఖీభవ పథకంపై ప్రచారం నిర్వహించారు.

March 22, 2026 / 06:16 PM IST

ఏపీ రైతులకు భారీగా నష్టం

AP: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఏపీ ఆక్వా రంగాన్ని దెబ్బతీసింది. పాలిమర్ కొరతతో ప్యాకింగ్ ఖర్చులు పెరిగాయంటూ ఎగుమతిదారులు రైతుల వద్ద కేజీకి రూ.10 తగ్గించి కొంటున్నారు. దీంతో ఉమ్మడి ప.గో. రైతులకే రోజూ రూ.75 లక్షల నష్టం వాటిల్లుతోంది. ఎక్స్ పోర్టర్లు సిండికేట్‌గా మారి దోచుకుంటున్నారని, ప్రభుత్వం పట్టించుకోట్లేదని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 22, 2026 / 06:14 PM IST

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు

MNCL: కోటపల్లి మండలం కాలేశ్వరం నుంచి బెల్లంపల్లి వెళ్లే బైక్ బోరంపల్లి వద్ద ఆదివారం బైక్ అదుపుతప్పి కింద పడింది. బెల్లంపల్లికి చెందిన జీదుల రాజ్ కుమార్, సరిత తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. 108కు ఫోన్ చెయ్యగా కోటపల్లి 108 సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 22, 2026 / 06:10 PM IST

సీసీ రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన సర్పంచ్

SRPT: అనంతగిరి మండలం అజ్నీర తండా గ్రామంలో MGNREGS నిధులు సుమారు రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ శ్రీవిద్య ఈరోజు శంకుస్థాపన చేశారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కొరకై గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా సహకరించాలని సర్పంచ్ కోరారు.

March 22, 2026 / 06:06 PM IST

ఈనెల 23న బీజేపీ అసెంబ్లీ ముట్టడి

WNP: ఈనెల 23న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు డీ.నారాయణ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను వంచిస్తోందని, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి బీజేపీ శ్రేణులు భారీగా తరలిరావాలని ఆయన కోరారు.

March 22, 2026 / 06:06 PM IST

రేపే ప్రజా సమస్యల పరిష్కార వేదిక..!

అన్నమయ్య: జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ఈనెల 23న సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీలు వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని, వివరాల కోసం 1,100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

March 22, 2026 / 06:06 PM IST

‘రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి’

KNR: శంకరపట్నం మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన రైతు సంఘం మహాసభలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా పాత పంపిణీ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు

March 22, 2026 / 06:05 PM IST

సీతారాముల కళ్యాణానికి విరాళం

NZB: ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై ఉన్న నవనాథ సిద్ధేశ్వర దేవాలయం అన్న ప్రసాదానికి సిద్ధేశ్వర పిరమిడ్ కమిటీ ఛైర్మన్ తిరుమల గంగారాం ఆలయ కమిటీ సభ్యులకు ఆదివారం రూ.16,101 విరాళం అందజేశారు. ఈనెల 27న సీతారాముల కళ్యాణం కోసం విరాళం అందజేసినందుకు కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

March 22, 2026 / 06:05 PM IST

NIT వరంగల్‌లో INNOTHON 3.0 ప్రారంభం

HNK: NIT వరంగల్‌లో హిటాచీ ఎనర్జీ ఇండియా సహకారంతో INNOTHON 3.0 హ్యాకథాన్ ప్రారంభమైంది. 28 జట్లకు చెందిన 127 మంది విద్యార్థులు పాల్గొని, 36 గంటల పాటు ఎనర్జీ ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ, రియల్ వరల్డ్ సమస్యల పరిష్కారాలపై ఆలోచనలు అభివృద్ధి చేస్తున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుంది.

March 22, 2026 / 06:03 PM IST

పోస్టర్లను ఆవిష్కరించిన ఎర్రబెల్లి

JN: రాఘవపురం గ్రామానికి చెందిన యువకుడు P. రాకేష్ కార్తికేయ(పూజారి రాజు) దర్శకత్వంలో పాలకుర్తి యువత తీసిన ‘ఒక ఫోటో ప్రేమ కథ’ అనే షార్ట్ ఫిలింను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలని, పాలకుర్తి ప్రాంతాల్లోని నటీ, నటులకు అండగా ఉంటామన్నారు.

March 22, 2026 / 06:03 PM IST

బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే

NRPT: మద్దూర్ మున్సిపల్ పరిధిలోని బీంపూర్‌లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే బీఆర్ఎస్ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ అని కొనియాడారు. రాబోయే రెండేళ్లలో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.

March 22, 2026 / 06:03 PM IST

‘ఏప్రిల్‌ను మహనీయుల మాసంగా ప్రకటించాలి’

SRD: ఏప్రిల్ నెలలో మహనీయుల మాసంగా ప్రకటించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు అన్నారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థుల భోజనంపై గరికపాటి వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో దళితులకు మొండి చేయి చూపిందని ఆరోపించారు.

March 22, 2026 / 06:02 PM IST

ఎయిర్టెల్ నెట్వర్క్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు

WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ద్వారకాపేట మెయిన్ రోడ్డుపై ఎయిర్టెల్ నెట్వర్క్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపై తవ్వకాలు జరిపారు.దీంతో పైప్ లైన్ పగిలి నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బ తినడంతో మున్సిపల్ ఛైర్మెన్ లక్ష్మీ రామానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించిన ఎయిర్టెల్ నెట్వర్క్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

March 22, 2026 / 06:02 PM IST

రేపటి ప్రజావాణికి సకాలంలో హాజరు కావాలి: కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లో రేపు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

March 22, 2026 / 06:02 PM IST