ప్రకాశం: కంభం పట్టణంలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల కాలంలో పట్టణంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదై, ఉక్కపోతకు అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో కొంత మేర ఉపశమనం పొందారు. అయితే ఉరుములు, మెరుపులు లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగలేదని స్థానిక ప్రజలు తెలిపారు.