TPT: మాజీ సీఎం జగన్పై టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. మహిళల ఆస్తి హక్కుల అంశంపై జగన్పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయం కుటుంబ వ్యవహారం మాత్రమే కాకుండా మహిళల హక్కులకు సంబంధించినదని పేర్కొన్నారు.