• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత

PDPL: మంథనిలోని పద్మశాలి వీధి వద్ద అక్రమంగా PDS బియ్యం తరలిస్తున్న గంట సమ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 10 సంచుల్లో సుమారు 4.60 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన బియ్యం విలువ రూ. 21,080గా అంచనా వేశారు. ఈ బియ్యాన్ని బేగంపేటకు చెందిన తూర్పాటి రాజుకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు వెల్లడించాడు.

March 29, 2026 / 07:02 AM IST

HYD శివారులో 500 ఎకరాల్లో బుల్లెట్ ట్రైన్ హబ్

HYD: నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. బుల్లెట్ రైలు హబ్ ఏర్పాటుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో 500 నుంచి 600 ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగరానికి అంతర్జాతీయ స్థాయి రవాణా సదుపాయాలు కలుగుతాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

March 29, 2026 / 07:01 AM IST

‘విద్యార్థులు పట్టుదలతో చదివి ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలి’

WNP: విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలతో నిరుత్సాహానికి గురి కావద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి లోని ఢిల్లీ వరల్డ్ స్కూల్‌లో వార్షిక సాంస్కృతిక సమావేశ కార్యక్రమనికి చిన్నారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించగలుగుతే ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు.

March 29, 2026 / 07:01 AM IST

‘విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు’

ASF: వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఆసిఫాబాద్ SE ఉత్తమ్ జాడే తెలిపారు. పెరుగుతున్న లోడ్‌కు అనుగుణంగా కొత్త నియంత్రికలు ఏర్పాటు చేసి, ఉపకేంద్రాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచామన్నారు. అంతరాయాలు తలెత్తితే వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఇంటర్లాంకింగ్ వ్యవస్థ ద్వారా మరో కేంద్రం నుంచి సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు.

March 29, 2026 / 07:01 AM IST

దిగొచ్చిన చికెన్ ధరలు.. కేజీ రూ. 300

NZB: నిజామాబాద్‌లో చికెన్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు కేజీ చికెన్ ధర 380 వరకు ఉండగా ఆదివారం కాస్త ధరలు దిగొచ్చాయి. పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి.. స్కిన్ లెస్ కేజీ చికెన్ 300- 330, విత్ స్కిన్ 280- 300, లైవ్ చికెన్ 150- 170గా ఉన్నాయి. కోడిగుడ్లు డజన్ 48గా ఉన్నాయి. మటన్ కిలో 850-900 కేజీగా విక్రయిస్తున్నారు.

March 29, 2026 / 07:01 AM IST

లోక్ అదాలత్తో సత్వర న్యాయం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

SRPT: లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకుంటే సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఇరుపక్షాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ. లక్ష్మీ శారద తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టులో నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్‌లో మొత్తం 1849 కేసులు పరిష్కారమయ్యాయని ఆమె తెలిపారు.

March 29, 2026 / 07:01 AM IST

కామారెడ్డి జిల్లాలో చికెన్ ధరల వివరాలు

KMR: జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. ఎండల తీవ్రతకు కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.380 నుంచి రూ.390 వరకు పలుకుతుండగా, విత్ స్కిన్ ధర రూ.350 నుంచి రూ.360కి చేరింది. లైవ్ కోడిని కిలో రూ.240 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగడంతో సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

March 29, 2026 / 07:01 AM IST

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్

మార్కాపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాయవరం బస్సు ప్రమాద బాధితులను నూతన కలెక్టర్ ఎం. విజయ సునీత శనివారం రాత్రి పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం గురించి వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పూర్తిగా కోలుకున్న తర్వాతనే ఆస్పత్రి నుంచి వెళ్లాలని వారికి భరోసా ఇచ్చారు.

March 29, 2026 / 07:00 AM IST

జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో డ్రోన్ నిఘా

SKLM: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని బహిరంగ ప్రదేశాలలో డ్రోన్ కెమెరాలతో సర్వే చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదన్నారు.

March 29, 2026 / 07:00 AM IST

రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ పోలీస్ మృతి

NLR: కందుకూరులోని సింహాద్రి నగర్‌కు చెందిన జంపాల వెంకటరమణయ్య, ఒంగోలు ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం బైక్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో వాహనం స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 29, 2026 / 07:00 AM IST

ఈ నెల 30లోగా నివేదికలు పంపాలి: కలెక్టర్

ELR: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన 30 పథకాల పురోగతిపై కలెక్టర్ కే.వెట్రిసెల్వి అధికారులతో సమీక్షించారు. ఏప్రిల్ 2న జరిగే DRC సమావేశానికి నియోజకవర్గాల వారీగా పూర్తిస్థాయి నివేదికలను ఈ నెల 30లోగా అందజేయాలని ఆమె ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయకపోతే వచ్చే ఆర్థిక సంవత్సర నిధుల మంజూరులో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు.

March 29, 2026 / 07:00 AM IST

44వ వసంతంలోకి తెలుగుదేశం

AP: తెలుగువారి అభిమాన ‘అన్నగారు’ NTR 1982 మార్చి 29న స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ 44వ వసంతంలోకి అడుగులు వేస్తోంది. ఢిల్లీ పాలకుల ముందు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకూడదనే నినాదంలో ఆవిర్భవించిన TDP.. 9 నెలల్లోనే 294కు 202 అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి వచ్చింది. రూ.2కే KG బియ్యం, వృద్ధ/వికలాంగ/వితంతువులకు పింఛన్లు తదితర ఎన్నో కొత్త పథకాలతో సంస్కరణలు తెచ్చింది.

March 29, 2026 / 06:59 AM IST

గూడూరులో రూ.18.15 లక్షలకు మార్కెట్లు వేలం

KRNL: గూడూరు మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు ఆధ్వర్యంలో నిన్న మార్కెట్లకు బహిరంగంగా 2026-27వ సంవత్సరానికి వేలం ప్రకటించారు. వారపు సంత మార్కెట్‌కు రూ.5.25 లక్షలు, కూరగాయల మార్కెట్‌కు రూ.12.14 లక్షలు, గొర్రెల మాంసం మార్కెట్‌కు రూ.40 వేలు, గొర్రెల కమేళాకు రూ.36 వేల ప్రకారం బహిరంగంగా వేలం జరిగింది. గతేడాది కంటే ఈ సంవత్సరం రూ.2.95 లక్షల ఆదాయం ఎక్కువ వచ్చిందన్నారు.

March 29, 2026 / 06:55 AM IST

తల్లీబిడ్డ ఆత్మహత్య.. వరకట్న వేధింపులే కారణం..!

WGL: వర్థన్నపేట మండలం కట్య్రాలలో ఓ వివాహిత తన మూడేళ్ల కుమారిడితో కలిసి కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే భర్త అదనపు డబ్బుల కోసం వేధింపులకు గురి చేయడంతో పుట్టింటివారిని ఇబ్బంది పెట్టకూడనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలుసులు కేసు నమోదు చేసుకుని ద్యారప్తు చేపట్టారు.

March 29, 2026 / 06:55 AM IST

నమ్మించి వంచించిన గల్ఫ్ ఏజెంట్

W.G: గల్ఫ్ దేశంలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన కేసులో పెనుగొండకు చెందిన షేక్ అబ్దుల్ సలీంను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు ముస్కుడి రమేష్‌ను డ్రైవర్ పనికి బదులు ఇంటి పనిలో చేర్పించడంతో అతని భార్య ఫిర్యాదు మేరకు సీఐ బి.యాదగిరి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.

March 29, 2026 / 06:54 AM IST