• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లాలో చికెన్ ధరల వివరాలు..?

ఆసిఫాబాద్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 235 నుంచి రూ. 240 మధ్య ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ. 267 నుంచి రూ. 280 వరకు పలుకుతోంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ధరలు పెరగడంతో గిరాకీ తగ్గిందని వ్యాపారులు పేర్కొన్నారు

March 29, 2026 / 09:35 AM IST

ట్రాఫిక్ ఉల్లంఘనలపై 266 కేసులు నమోదు

KDP: జిల్లా వ్యాప్తంగా నిన్న నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు 266 కేసులు నమోదు చేసి రూ.54,365 జరిమానా విధించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

March 29, 2026 / 09:35 AM IST

కాకినాడ నుంచి పోలవరానికి మళ్ళిన పెద్దపులి

KKD: 2 నెలలకు పైగా కాకినాడ, పోలవరం జిల్లాల్లో కలవరం సృష్టించిన పెద్దపులి ఇప్పుడు పోలవరం అటవీ ప్రాంతంలో సంచరిస్తూ గిరిజన గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. శనివారం జోడుమామిళ్ల, పోతవరం పరిసరాల్లో పులి కదలికలను గుర్తించినట్లు సబ్ DFA అనూష, రేంజ్ అధికారి కొండలరావు తెలిపారు. పులి అటవీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు.

March 29, 2026 / 09:34 AM IST

ఐఐటీలో సైక్లింగ్ కార్యక్రమం

SRD: కంది పరిధిలోని ఐఐటి హైదరాబాద్‌లో ఆదివారం సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐఐటి ప్రొఫెసర్లు విద్యార్థులు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మూర్తి పాల్గొన్నారు.

March 29, 2026 / 09:33 AM IST

నరసరావుపేటలో మాంసం ధరలు ఇలా..!

PLD: నరసరావుపేటలో ఆదివారం మాంసం ధరలు మండిపోతున్నాయి. లైవ్ కోడి కిలో రూ. 130 ఉండగా, స్కిన్‌తో కూడిన చికెన్ రూ.300-320, స్కిన్ లెస్ రూ. 340 వరకు విక్రయిస్తున్నారు. నాటుకోడి కిలో రూ. 400 పలుకుతుండగా, మటన్ ధర కేజీ రూ. 900 నుంచి రూ.1000 మధ్య ఉంది. ఆర్టీసీ బస్టాండ్, సత్తెనపల్లి రోడ్డు వంటి ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

March 29, 2026 / 09:33 AM IST

ఘనంగా సీతారామచంద్రస్వామి రథోత్సవం

RR: షాద్‌నగర్ నియోజకవర్గం వెల్జర్ల గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రథోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి పాల్గొన్నారు. ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు అని గ్రామస్తులు పేర్కొన్నారు. రథోత్సవం సందర్భంగా భక్తులు ఆటపాటలతో అలరించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

March 29, 2026 / 09:33 AM IST

భద్రాచలంలో ఘనంగా స్వామివారి రథోత్సవం

TG: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి మహా పట్టాభిషేకం అనంతరం నిన్న రాత్రి స్వామివారు రథోత్సవంపై భక్తులకు దర్శనమిచ్చారు. సీతమ్మ సమేతంగా భద్రాద్రి రామయ్య సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై పట్టణ పురవీధుల్లో విహరించారు. ‘జై శ్రీరామ్’ నినాదాలతో భద్రగిరి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

March 29, 2026 / 09:32 AM IST

‘తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక టీడీపీ’

ELR: తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక టీడీపీ అని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం టీ.నర్సాపురం మండలం తిరుమలదేవిపేట పంచాయతీ పరిధిలో జరిగిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జండా ఎగరవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సామాన్య ప్రజల అభివృద్ధి కోసం టీడీపీ కృషి చేసిందన్నారు.

March 29, 2026 / 09:31 AM IST

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు

VSP: ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని అండర్ బ్రిడ్జిలో ఓ బస్సు అదుపుతప్పి ఇవాళ డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 29, 2026 / 09:30 AM IST

వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం

VZM: ఎస్ కోట మండల కేంద్రంలోని బ్రాహ్మణవీధి రామాలయంలో శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా స్వామివారికి అర్చనలు, అభిషేకాలు జరిపి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘురాజు, తదితరులు పాల్గొన్నారు.

March 29, 2026 / 09:30 AM IST

మేయర్‌కు వినతి పత్రం అందించిన ఆటో డ్రైవర్‌లు

BDK: స్వచ్ఛ ఆటో డ్రైవర్లు తమను శానిటేషన్ విభాగంలో డ్రైవర్లుగా గుర్తించాలని కోరుతూ ఆదివారం మేయర్ గణేష్‌కు వినతిపత్రం అందజేశారు. కార్పొరేషన్ పరిధిలో తమకు ప్రాధాన్యత ఇచ్చి ఆదుకోవాలని వారు మేయర్ను వేడుకున్నారు. ఆరేళ్లుగా మున్సిపాలిటీలో సేవలందిస్తున్నామని, ప్రస్తుతం ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

March 29, 2026 / 09:30 AM IST

తీవ్ర విషాదం.. యువకుడు మృతి

VKB: పరిగి(M) రూప్ సింగ్ తండాలో ఈ నెల 24న సర్పంచ్ రమణి భాయ్, ఆమె భర్త హన్మంతుపై ఆయన మొదటి భార్య కొడుకు అనార్సింగ్ పెట్రోల్ పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే. సర్పంచ్ రమణి భాయ్ ఇద్దరు పిల్లలు వెంకటేశ్, శివకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు నిన్న రాత్రి పరిస్థితి విషమించి వెంకటేశ్ మృతి చెందాడు.

March 29, 2026 / 09:27 AM IST

తీవ్ర విషాదం.. యువకుడు మృతి

VKB: పరిగి(M) రూప్ సింగ్ తండాలో ఈ నెల 24న సర్పంచ్ రమణి భాయ్, ఆమె భర్త హన్మంతుపై ఆయన మొదటి భార్య కొడుకు అనార్సింగ్ పెట్రోల్ పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే. సర్పంచ్ రమణి భాయ్ ఇద్దరు పిల్లలు వెంకటేశ్, శివకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు నిన్న రాత్రి పరిస్థితి విషమించి వెంకటేశ్ మృతి చెందాడు.

March 29, 2026 / 09:27 AM IST

వాట్సాప్ హ్యాక్ చేసి రూ.52 వేలు డబ్బులు దోపిడీ

SKLM: నరసన్నపేట మండలం కొమర్తికి చెందిన దిలీప్ కుమార్ వాట్సాప్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి, అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.52 వేలును దోచుకెళ్లారు. బాధితుడు వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై గణేష్ శనివారం తెలిపారు. ప్రజలు మొబైల్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

March 29, 2026 / 09:27 AM IST

లోక్ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కారం

సిద్దిపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్, ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరించారు. ఈ సందర్భంగా మొత్తం 5,454 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.

March 29, 2026 / 09:26 AM IST