BDK: స్వచ్ఛ ఆటో డ్రైవర్లు తమను శానిటేషన్ విభాగంలో డ్రైవర్లుగా గుర్తించాలని కోరుతూ ఆదివారం మేయర్ గణేష్‌కు వినతిపత్రం అందజేశారు. కార్పొరేషన్ పరిధిలో తమకు ప్రాధాన్యత ఇచ్చి ఆదుకోవాలని వారు మేయర్‌ను వేడుకున్నారు. ఆరేళ్లుగా మున్సిపాలిటీలో సేవలందిస్తున్నామని, ప్రస్తుతం ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.