KDP: జిల్లా వ్యాప్తంగా నిన్న నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు 266 కేసులు నమోదు చేసి రూ.54,365 జరిమానా విధించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.