• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు దుకాణాల వేలం

KNR: గన్నేరువరం గ్రామ పంచాయతీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ ఆస్తుల వేలం ఈనెల 30న ఉదయం 11 గంటలకు పంచాయతీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ లచ్చినర్సు తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలో 17 షెటర్లు, గ్రామ సంతను వేలంపాట నిర్వహిస్తున్నామని, ఈ వేలం పాటలో పాల్గొనదలచిన వారు రూ. 10,000 డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు.

March 29, 2026 / 12:02 PM IST

పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం: చిన్నారెడ్డి

WNP: ఆపదలో ఉన్న పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు, వారికి ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రజా ప్రభుత్వం ముందుంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 168 మంది లబ్దిదారులకు రూ. 38,99,500 విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 

March 29, 2026 / 12:01 PM IST

మేడారంలో రెచ్చిపోతున్న దొంగలు

MLG: మేడారంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వనదేవతల గద్దెల ప్రాంగణంలో కిరాణా దుకాణాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. శనివారం అర్ధరాత్రి ఓ దుకాణంలో దొంగలు చొరబడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇటీవల కాలంలో మేడారంలో దొంగతనాలు ఎక్కువ అయ్యాయని వ్యాపారులు వాపోతున్నారు. పోలీసులు దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

March 29, 2026 / 12:01 PM IST

ఆహ్వాన పత్రాలకు ప్రత్యేక పూజలు

BHNG: రాజాపేట మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ మండల ప్రఖండ అధ్యక్షులు జ్ఞానేందర్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తేదీన వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహక బృందం తెలిపారు. ఆదివారం ఏకాదశి పర్వదినం రోజున శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో ఆహ్వాన పత్రాలకు ప్రత్యేక పూజలు జరిగిన అనంతరం కరపత్రాల పంపిణీ చేపట్టారు.

March 29, 2026 / 12:01 PM IST

జామడలో మహిళా అభ్యాసులకు అక్షరాస్యత పరీక్షలు

ADB: నార్నూర్ మండలంలోని జామడ గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం మహిళా అభ్యాసుల కోసం FLNAT/NIOS పరీక్షలు నిర్వహించారు. సర్పంచ్ చందు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని పరీక్షలు రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ పరీక్షలు నిర్వహించినట్లు సర్పంచ్ తెలిపారు.

March 29, 2026 / 12:01 PM IST

గర్భాంలో ఘనంగా మట్టల ఆదివారం

VZM: మెరకముడిదాం మండలం గర్భాం గ్రామంలో చిన్నారులు, యువత మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో ఈత మట్టలు పట్టుకొని తిరుగుతూ కీర్తనలు పాడారు. మట్టల ఆదివారం ప్రాముఖ్యతను, ఏసుక్రీస్తు జీవిత చరిత్రను పాస్టర్ అబ్రహం వివరించారు. మానవాళికి శాంతిని, సన్మార్గాన్ని నడిపించడానికి భూలోకానికి వచ్చి మానవుల కోసం చనిపోయారని బైబిలు చెబుతోందన్నారు.

March 29, 2026 / 12:00 PM IST

చినకుదమలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం జియమ్మవలస మండలం చినకుదమ గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డొంకాడ రామకృష్ణ పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 29, 2026 / 12:00 PM IST

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

AKP: అచ్యుతాపురం మండలం నునపర్తిలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ ఎలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. పేద ప్రజల కష్టాల నుంచి టీడీపీ ఆవిర్భవించిందన్నారు. పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకువచ్చారన్నారు.

March 29, 2026 / 12:00 PM IST

నునపర్తిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

AKP: అచ్యుతాపురం మండలం నునపర్తిలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ ఎలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. పేద ప్రజల కష్టాల నుంచి టీడీపీ ఆవిర్భవించిందన్నారు. పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకువచ్చారన్నారు.

March 29, 2026 / 12:00 PM IST

స్పీడ్ లేజర్ గన్స్‌తో నిబంధనల అతిక్రమణలకు చెక్

VSP: GVMC కమిషనర్ ఇటీవల విశాఖ ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చిన స్పీడ్ లేజర్ గన్స్‌ను త్రీ టౌన్ ట్రాఫిక్ సీఐ అమ్మినాయుడు బీచ్ రోడ్డులో ట్రయిల్ రన్ నిర్వహించారు. నేటి నుంచి ఈ స్పీడ్ లేజర్ గన్స్ నిబంధనలు అతిక్రమించి డ్రైవింగ్ చేసిన వారికి చలానాలు వేయనున్నారని తెలిపారు. 40KMలకు మించి అతి వేగం,హెల్మెట్ లేకుండా బండి నడపడం వంటి ఉల్లంఘనలకు చెక్ పెట్టి చలానాలు విధిస్తామన్నారు.

March 29, 2026 / 12:00 PM IST

దేవరకొండలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

NLG: దేవరకొండలో టీడీపీ 44 ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ వస్కుల కృష్ణయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్వీట్లు పంపిణీ చేసి వేడుకలని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

March 29, 2026 / 11:59 AM IST

రేపు రాములబండలో ఉచిత మెగా వైద్య శిబిరం

NLG: ‘ప్రజా పాలన ప్రగతి నివేదిక’లో భాగంగా నల్లగొండ మండలం రాములబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం భారీ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ఎండీ. అబ్దుల్ జమీర్ తెలిపారు. గ్రామస్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 29, 2026 / 11:56 AM IST

ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేశాం: MLA

NLR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో వేగూరు పంచాయతీలో రూ. 2.78 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని కోవూరు MLA ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రతి గ్రామంలో తాగునీరు, స్మశాన వాటికలు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చామని దానికి అనుగుణంగా దాదాపు పూర్తి చేశామన్నారు. గ్రామంలో వాటర్ ట్యాంక్, డ్రైనేజీలు, సీసీ రోడ్ల పనులను చేశామన్నారు.

March 29, 2026 / 11:56 AM IST

సంబేపల్లిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

అన్నమయ్య: సంబేపల్లి మండల కేంద్రంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని, ప్రజాసేవతోనే పార్టీ బలపడుతుందని అన్నారు.

March 29, 2026 / 11:54 AM IST

జిల్లా ఎస్పీని కలిసిన కేంద్ర ప్రభుత్వ సలహాదారు

ATP: జిల్లా ఎస్పీ పి.జగదీష్ (IPS)ను కేంద్ర ప్రభుత్వ హిందీ సలహాదారు ఎస్. గైబువల్లి, మాజీ జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు ఎం.ఎం.డి. ఇమామ్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వారు అభినందించారు. ఎస్పీతో కలిసి పలు సామాజిక అంశాలపై చర్చించారు.

March 29, 2026 / 11:51 AM IST