• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శిగా లెనిన్ బాబు

KRNL: ఆలూరులో మార్చి 28, 29 తేదీల్లో జరిగిన ఏఐటీయూసీ 21వ మహాసభలో నక్కి లెనిన్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆదివారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుకుగా ఉన్న లెనిన్ బాబు, ఏఐఎస్ఎఫ్ ద్వారా పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారని తెలిపారు.

March 29, 2026 / 10:00 PM IST

మంగపల్లెలో ఫ్రీ మెడికల్ క్యాంప్ విజయవంతం

NDL: సంజామల మండల పరిధిలోని మంగపల్లెలో ఆదివారం నిర్వహించిన 66వ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు డైరెక్టర్ పి.షేక్షావలి రెడ్డి తెలిపారు. శిబిరానికి విచ్చేసిన 1000 మందికిపైగా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మెడిసిన్, భోజన వసతి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తండ్రి డా. దస్తగిరి రెడ్డి సహకారంతో ప్రజలకు సేవ చేయడం అదృష్టమన్నారు.

March 29, 2026 / 10:00 PM IST

రప్పా రప్పా అంటే సహించేది లేదు: ఎమ్మెల్యే

PLD: ప్రత్యర్థుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, అధికారం లేని సమయంలో కూడా తెలుగు తమ్ముళ్లు వెనక్కి తగ్గలేదని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మాచర్లలో ఆయన మాట్లాడుతూ.. రప్పా రప్పా అంటూ కూతలు కూస్తే సహించేది లేదని హెచ్చరించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు.

March 29, 2026 / 09:59 PM IST

రామయ్య కళ్యాణానికి 85 వేల TTD లడ్డూలు సిద్ధం

 TPT: ఏప్రిల్ 1న ఒంటిమిట్టలో జరగనున్న శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవానికి TTD 85 వేల తిరుమల శ్రీవారి లడ్డూలను సిద్ధం చేసింది. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-1లో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది శ్రీవారి సేవకులు పాల్గొని లడ్డూల ప్యాకింగ్ విజయవంతంగా పూర్తి చేశారు.

March 29, 2026 / 09:58 PM IST

అమ్మకు – అక్షరమాల పరీక్ష విజయవంతం

JGL: మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో ‘అమ్మకు అక్షరమాల’ పరీక్ష ఆదివారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ శ్రీ దప్పుల పద్మ నర్సయ్య, సీసీ సంతోష్, VOA నవభారతి, VO అధ్యక్షురాలు గుర్రాల వనిత ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్ష అక్షరాస్యతను పెంపొందిస్తుంది.

March 29, 2026 / 09:50 PM IST

‘ఉచిత బస్సు.. మహిళలకు రూ. 10 వేల కోట్లు ఆదా’

TG: మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.10వేల కోట్లు ఆదా అయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అడబిడ్డల అకౌంట్లలో పొదుపు సిరి.. తెలంగాణ ప్రగతికి ఇదే అసలైన దారి అని మంత్రి అన్నారు. ఇది కేవలం ప్రయాణం కాదు.. తెలంగాణ ఆడబిడ్డల గెలుపు అని పేర్కొన్నారు.

March 29, 2026 / 09:50 PM IST

దర్శకుడు మురుగదాస్‌పై నిర్మాత ఫిర్యాదు

దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ‘మదరాసి’ సినిమా బడ్జెట్‌ను రూ.115 కోట్ల నుండి రూ. 170 కోట్లకు పెంచారన్న ఆరోపణలతో నిర్మాత కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన కౌన్సిల్, నష్టపరిహారంగా ‘రమణ 2’ కథను సదరు నిర్మాణ సంస్థకు ఉచితంగా ఇవ్వాలని మురుగదాస్‌కు సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఈ వివాదానికి ముగింపు పడుతుందో లేదో అని చర్చ నడుస్తోంది.

March 29, 2026 / 09:48 PM IST

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

AP: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. గత ఎన్నికల్లో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు పిలుపుతో తన కుటుంబమంతా కలిసి ప్రచారం నిర్వహించామని గుర్తు చేశారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

March 29, 2026 / 09:48 PM IST

మండల కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరం

MBNR: మహమ్మదాబాద్ మండల కేంద్రంలో ఓ కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో 217 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 32 మందిని ఉచిత ఆపరేషన్ల కోసం ఆసుపత్రికి తరలించారు. వారికి భోజనం, రవాణా సౌకర్యాలను ఉచితంగా కల్పించారు. సర్పంచ్ రాంలాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నారాయణ, డా. శ్రవంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 29, 2026 / 09:46 PM IST

శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న ఏఎస్పీ

SDPT: మెదక్ ఏఎస్సీగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. గతంలో హుస్నాబాద్ అదనపు కమిషనర్‌గా పనిచేసిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు, సిబ్బంది ఆయనను సన్మానించారు.

March 29, 2026 / 09:38 PM IST

200 సిక్సర్ల క్లబ్‌లో రహానే

KKR కెప్టెన్ అజింక్య రహానే టీ20 కెరీర్‌లో ఓ సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 5 సిక్సర్లు కొట్టడం ద్వారా రహానే, టీ20ల్లో 200 సిక్సర్ల మార్క్‌ను దాటాడు. ఈ మ్యాచ్‌లో రహానే కేవలం 40 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 భారీ సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు.

March 29, 2026 / 09:38 PM IST

రఘుపతి పేటలో హైమస్ట్ లైట్లు ప్రారంభం

NGKL: కల్వకుర్తి మండలం రఘుపతి పేట గ్రామంలో ఆదివారం రాత్రి జుమ్మా మసీదు ముందు గ్రామ సర్పంచ్ గుండాల గణేష్ హైమస్ట్ లైట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా హైమస్ట్ లైట్లు మంజూరు చేయించిన స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

March 29, 2026 / 09:36 PM IST

‘పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభించాలి’

MDK: నూతన విద్యాపాలసిలో ప్రతి గ్రామపంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ పాఠశాలలో పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభించి తరగతికి ఒక టీచర్‌ను, ప్రీ ప్రైమరీకి ఒక టీచర్‌ను కేటాయించాలని ఎస్జిటియు రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. తూప్రాన్‌లో రాష్ట్ర శాఖ సమావేశం నిర్వహించగా రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, మధుసూదన్, జింక అశోక్ పాల్గొన్నారు.

March 29, 2026 / 09:35 PM IST

వార్ ఎఫెక్ట్.. కండోమ్స్ కొరత

పశ్చిమాసియా యుద్ధం కారణంగా కండోమ్ల తయారీకి అవసరమైన ముడిసరుకుల సరఫరా నిలిచిపోవడంతో, వాటి ఉత్ప త్తి గణనీయంగా పడిపోయింది. తయారీలో లూబ్రికేషన్ కోసం వాడే సిలికాన్ ఆయిల్ కొరత ఏర్పడడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దీనికి తోడు కండోమ్ చిరిగిపోకుండా ఉండటానికి ఉపయోగించే అమ్మోనియా ధరలు 40 శాతానికి పైగా పెరగడం తయారీదారులకు పెను భారంగా మారినట్లు తెలుస్తోంది.

March 29, 2026 / 09:35 PM IST

సీఎం రేవంత్​ రెడ్డితో మేనకాగాంధీ బృందం భేటీ

TG: సీఎం రేవంత్​ రెడ్డితో మేనకాగాంధీ బృందం భేటీ అయింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ చర్యలపై అధికారులు వివరించారు. వీధికుక్కలకు స్టెరిలైజేషన్‌పై పవర్​ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు.

March 29, 2026 / 09:35 PM IST