• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇసుక తరలించేందుకు అనుమతులు

VKB: ఇందిరమ్మ ఇళ్లకు అవసరమయ్యే ఇసుక తరలించేందుకు మన ఇసుక వాహనం యాప్ ద్వారా అనుమతులు జారీ చేస్తున్నట్లు ఎంపీడీవో విశ్వప్రసాద్ తెలిపారు. పాత తాండూర్, వీర్‌షెట్పల్లి, చిట్టి ఘనపూర్, కాగ్న నది నుంచి ఇసుక పొందేందుకు యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ట్రాక్టర్‌కు రూ.214 చెల్లించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.

March 30, 2026 / 07:57 AM IST

సిద్దేశ్వరుడి జాతరకు మహారథం సిద్ధం

SRD: కంగ్టిలో సిద్దేశ్వరుడి జాతరకు మహారథం సిద్ధమవుతోంది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారంగా జాతరకు వారం రోజులు ముందుగానే రథాన్ని తయారు చేసే పనులు చేపడతారు. వచ్చే వారంలో శిఖరోత్సవం, అగ్నిగుండాలు రథోత్సవం తదితర కార్యక్రమాలు జరుగుతాయి. మండల ప్రజలే కాకుండా, కర్ణాటక, మహారాష్ట్ర నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారని చెప్పారు.

March 30, 2026 / 07:50 AM IST

జిల్లాలో భారీగా పడిపోయిన ధరలు.. బంద్ ప్రభావమా..?

VKB: కోడిగుడ్ల ధరలు గణనీయంగా పడిపోవడం పౌల్ట్రీ రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం జిల్లాలో గుడ్డు ధర రూ.3.50-రూ.4.50 మధ్య, ఇక ట్రే గుడ్లు రూ.120-రూ.140 పడిపోవడం చిన్న వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

March 30, 2026 / 07:49 AM IST

వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలు

NGKL: బల్మూరు మండలం గట్టుతుమ్మెన్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ గౌడ్, గ్రామ పెద్దలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 30, 2026 / 07:48 AM IST

కిన్నెరసానిలో పర్యాటకుల సందడి భారీ ఆదాయం

BDK: కిన్నెరసాని పర్యాటక కేంద్రం ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 265 మంది పర్యాటకులు డ్యాం డీర్ పార్క్‌ను సందర్శించి సందడి చేశారు. దీని ద్వారా వైల్డ్ లైఫ్ శాఖకు రూ. 15,635 ఆదాయం సమకూరింది. అలాగే 210 మంది పర్యాటకులు బోటు షికారు చేయడంతో టూరిజం కార్పొరేషన్‌కు రూ.12,860 ఆదాయం లభించింది అని అధికారులు తెలిపారు.

March 30, 2026 / 07:47 AM IST

నేడు మూలపేట పోర్టుకు వైసీపీ నేతలు

AP: శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు ఇవాళ వైసీపీ నేతలు వెళ్లనున్నారు. కాగా, పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నౌపడ జంక్షన్ దగ్గర మాత్రమే వైసీపీ సభకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. షరతులు లేకుండా అనుమతులు ఇవ్వాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. న్యాయబద్ధమైన కార్యక్రమాన్ని కూటమి సర్కారు అడ్డుకుంటోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

March 30, 2026 / 07:47 AM IST

నల్లమల్ల ఘాట్ రోడ్డులో లారీ బోల్తా

NDL: నంద్యాల-గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవరు గాయాలవ్వగా, సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న సిరివెళ్ల, మహానంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై పడిపోయిన వాహనాన్ని పక్కకు తొలగించడంతో రాకపోకలు పునరుద్ధరణ అయ్యాయి. ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు.

March 30, 2026 / 07:45 AM IST

నేడు ఈ ప్రాంతంలో హోటళ్లు బంద్

NLG: వాణిజ్య గ్యాస్ కొరతను నిరసిస్తూ దేవరకొండలో హోటళ్లు, వ్యాపార సంస్థల బంద్‌కు నిర్వాహకులు పిలుపునిచ్చారు. తోపుడు బండ్లు, టీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నిత్యం జరుగుతున్న దాడులు, అధిక పన్నుల భారం తగ్గించాలని కోరారు. గ్యాస్ కొరతను వెంటనే తీర్చాలని వారు విజ్ఞప్తి చేశారు.

March 30, 2026 / 07:45 AM IST

‘పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే భర్తరఫ్ చేయాలి’

JN: జనగాం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ లకావత్ నేడు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ అసెంబ్లీలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు, ఉపయోగించిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నిండు సభలో ఒక దళిత ఎమ్మెల్యేను బెదిరించడం అత్యంత హేయమైన చర్య అని ఆమె అన్నారు.

March 30, 2026 / 07:44 AM IST

గోకవరం ఎస్సైను అభినందించిన డీఎస్పీ సురేష్

E.G: గోకవరం పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పవన్ కుమార్‌ను నార్త్ జోన్ డీఎస్పీ సురేష్ బాబు అభినందించారు. చోరీ కేసులను, గంజాయి అక్రమ రవాణా, పలు కేసులను చాకచక్యంగా ఛేదించినందుకు కోరుకొండ సీఐ మూర్తి కార్యాలయంలో పవన్ కుమార్అభినందించి ఆదివారం ప్రశంసా పత్రం అవార్డును అందించారు. ఈ అవార్డు అందుకోవడంతో గోకవరం మండల ప్రజానీకం ఎస్సైకు అభినందనలు తెలిపారు

March 30, 2026 / 07:42 AM IST

నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ

ATP: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీ సీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్‌లో తేటి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు సెల్ నంబర్ 8977716661 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

March 30, 2026 / 07:40 AM IST

ఐదువేల క్యూసెక్కుల నీరు విడుదల

KDP: గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయరుకు 5 వేల క్యూసెక్కుల నీటిని పంపుతున్నట్లు జలవనరుల శాఖ EE ఉమామహేశ్వర్లు ఆదివారం తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 2,500 క్యూసెక్కుల నుంచి 5 వేల క్యూసెక్కులకు పెంచి నీటిని పంపుతున్నట్లు వెల్లడించారు. గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం రిజర్వాయరుకు 2 టీఎంసీల నీటిని పంపు తామన్నారు.

March 30, 2026 / 07:39 AM IST

‘ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య’

PDPL: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నట్లు అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ షేక్ పేర్కొన్నారు. ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 97 కు పెంచడానికి కృషిచేసిన ఉపాధ్యాయులను, గ్రామస్తులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

March 30, 2026 / 07:39 AM IST

మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు

JGL: అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్నారని మాజీ సర్పంచులను జగిత్యాల రూరల్ పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్న బీఆర్ఎస్ మాజీ సర్పంచులను జగిత్యాల రూరల్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.

March 30, 2026 / 07:38 AM IST

ఏపీ గవర్నర్ తిరుమల పర్యటన

TPT: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఇవాళ, రేపు తిరుమల-తిరుపతి పర్యటనకు రానున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారన్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు పేర్కొన్నారు. అధికారులతో సమావేశం నిర్వహించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

March 30, 2026 / 07:38 AM IST