E.G: గోకవరం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పవన్ కుమార్ను నార్త్ జోన్ డీఎస్పీ సురేష్ బాబు అభినందించారు. చోరీ కేసులను, గంజాయి అక్రమ రవాణా, పలు కేసులను చాకచక్యంగా ఛేదించినందుకు కోరుకొండ సీఐ మూర్తి కార్యాలయంలో పవన్ కుమార్అభినందించి ఆదివారం ప్రశంసా పత్రం అవార్డును అందించారు. ఈ అవార్డు అందుకోవడంతో గోకవరం మండల ప్రజానీకం ఎస్సైకు అభినందనలు తెలిపారు