• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

2 కిలోల కనతి తొలగింపు

MDK: తూప్రాన్ పట్టణంలోని సుష్మ ఆస్పత్రిలో మహిళ గర్భాశయంలో ఉన్న రెండు కిలోల బరువైన పైబ్రాడ్ గర్భాశయ కణితి తొలగించారు. దంతాన్ పల్లికి చెందిన లక్ష్మి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ డాక్టర్ ప్రదీప్ సింహాను సంప్రదించింది. స్కానింగ్‌లో గుర్తించి వైద్యులు హేమరాజ్ సింగ్, శ్రావణ్ కుమార్, తిరుపతి, ప్రదీప్ సింహల బృందం ఆపరేషన్ చేసి తొలగించారు.

March 30, 2026 / 07:32 AM IST

చదరంగం పోటీలకు విశేష స్పందన

KNR: కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం నిర్వహించిన అంతర్గత చదరంగం పోటీలకు విశేష స్పందన లభించింది. సుమారు 80 మంది విద్యార్థులు తమ మేధాశక్తిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా దాసరి శ్రీపాల్ రెడ్డి, జీనియస్ చెస్ అకాడమీ కోచ్ అనూప్ కుమార్ మాట్లాడుతూ.. చదరంగంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆలోచనాశక్తి పెరుగుతాయని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

March 30, 2026 / 07:31 AM IST

గద్వాల బస్టాండ్‌లో బీఆర్ఎస్వీ దీక్ష

GDWL: పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షుడు గడ్డం భరత్ బాబు జోగులాంబ గద్వాల పాత బస్టాండ్ వద్ద ఈనెల 30న బీఆర్ఎస్వీ పోరు దీక్ష విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ దీక్ష చేపడతామని పేర్కొన్నారు. విద్యార్థులు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.

March 30, 2026 / 07:31 AM IST

నేడు ప్రజావాణి కార్యక్రమం

MLG: ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమంతో పాటు గిరివాణి(గిరిజన దర్బార్) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. గిరిజనులు, గిరిజనేతరులు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అర్జీలు సమర్పించాలని సూచించారు.

March 30, 2026 / 07:31 AM IST

రోడ్డు ప్రమాదంలో గొర్రెలు మృతి.. భారీ నష్టం

ప్రకాశం: కంభం మండలంలోని జంగంగుంట్ల గ్రామ సమీపంలో గల జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గొర్రెల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 గొర్రెలు మృతిచెందగా.. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో సుమారు రూ.6 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. వర్షం కారణంగా రహదారి కనిపించక ప్రమాదం జరిగినట్లు బస్సు డ్రైవర్ తెలిపాడు.

March 30, 2026 / 07:30 AM IST

నేడు P4 నియోజకవర్గ స్దాయి వార్షికోత్సవం

VZM: స్దానిక ZP సమావేశ మందిరంలో సోమవారం మద్యాహ్నం 2 గంటలకు P4 కార్యక్రమం కింద VZM నియోజకవర్గ స్థాయి వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ZP CEO బి.వి.సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ పురోగతి, విజయాలు, భవిష్యత్‌ కార్యాచరణలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA అదితి గజపతి రాజా పాల్గోననున్నారని ఆయన పేర్కొన్నారు.

March 30, 2026 / 07:30 AM IST

‘100% పన్ను వసూల్లే లక్ష్యం’

CTR: జిల్లాలోని 621 పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం పన్నుల వసూలు లక్ష్యం రూ.24.14 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.22.83 కోట్లు వసూలు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావు తెలిపారు. 100% లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పన్నుల వసూలు లక్ష్యం చేరుకునేలా తప్పనిసరిగా కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించినట్టు ఆయన వెల్లడించారు.

March 30, 2026 / 07:28 AM IST

విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం

అన్నమయ్య: పీలేరు బండ్లవంక ప్రాంతా నికి చెందిన వంశీకృష్ణ(32) ఎలక్ట్రిషియన్.అతడు MNR కల్యాణ మండపంలో జరిగే వివాహ వేడుకలకు ఆదివారం విద్యుదీపాలంకరణ పనులకు వెళ్లాడు.అక్కడ విద్యుత్తు వంశీకృష్ణ స్తంభాన్ని ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అతడు అప్పటికే మృతి చెందాడన్నారు.

March 30, 2026 / 07:26 AM IST

బైక్‌తో శబ్దాలు చేస్తే చర్యలు తప్పవు: సీఐ

NLR: బుచ్చి సీఐ శ్రీనివాసరావు ఆకతాయిల ఆట కట్టించారు. ఆదివారం రాత్రి నిబంధనలకు విరుద్ధంగా బైక్లకు సైలెన్సర్లు బిగించుకుని హల్చల్ చేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించారు. సైలెన్సర్‌ను నిర్వీర్యం చేయించి యువకుడి తలపై పెట్టి మరోసారి ఇటువంటి తప్పు చేయనని ప్రమాణం చేయించారు. ఎవరైనా సైలెన్సర్లు వినియోగిస్తే, ఇదేవిధంగా పట్టణంలో ఊరేగిస్తామని సీఐ హెచ్చరించారు.

March 30, 2026 / 07:26 AM IST

NIT వరంగల్‌లో అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

WGL: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఎంటెక్, పీహెచ్‌డీ, ఎంబీఏ, ఎంఏ ఇన్ ఇంగ్లిష్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించారు. పీహెచ్‌డీకి ఏప్రిల్ 18, ఇతర కోర్సులకు ఏప్రిల్ 25 వరకు గడువు ఉంది. GATE, NET లేదా ఇన్‌స్టిట్యూట్ ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

March 30, 2026 / 07:26 AM IST

నేటి నుంచి శనగ కొనుగోలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు

KMR: మద్నూర్‌ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో నేటి నుంచి శనగ కొనుగోలు చేయనున్నారు. తీసుకోవలసిన జాగ్రత్తలు… ఎకరాకు ఏడు క్వింటాళ్లు. ఒక రైతు 40 క్వింటాళ్లు అమ్మకానికి పరిమితి. పంట 14 శాతం తేమ మించకూడదు. పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఏఈవో దగ్గర ధ్రువీకరణ పత్రంతో పంట అమ్మకానికి తీసుకుని రావాలని సొసైటీ అధికారులు వివరించారు.

March 30, 2026 / 07:25 AM IST

డబ్బులు కక్కాల్సిందే.. బీజేపీ అల్టిమేటం!

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం అధిష్టానం పంపిన నిధులు దుర్వినియోగమైనట్లు బీజేపీ నాయకత్వం ఒక అంచనాకు వచ్చిందట. పార్టీ పంపిన ఫండ్స్ పూర్తిస్థాయిలో అభ్యర్థులకు చేరలేదని, మధ్యలో ఆయా జిల్లాల అధ్యక్షులు సగానికి పైగా ‘స్వాహా’ చేశారని గుర్తించందట. పలు రకాల సమీక్షల అనంతరం అగ్రనేతలు ఈ అంచనాకు వచ్చారట. దీంతో ఫండ్స్ స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోనుందట.

March 30, 2026 / 07:25 AM IST

జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి

KRNL: ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ గుప్తా ఒక ప్రకటనలో చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకేషనల్ జూనియర్ కాలేజీలో జాబ్మేళా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. జాబ్‌మేళాలో 16 కంపెనీలు పాల్గొంటున్నాయి. మొత్తం 1110 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 30, 2026 / 07:24 AM IST

తల్లిదండ్రులను హింసిస్తున్న కొడుకులకు వార్నింగ్

SDPT: మద్యం తాగి వేధిస్తున్న తమ ఇద్దరు కుమారులపై వృద్ధ దంపతులు ఫిర్యాదు చేసిన ఘటన ఆదివారం దుబ్బాకలో చోటుచేసుకుంది.  CI రాజేశ్ తెలిపిన వివరాలు.. కంచం కనకయ్య, రాజవ్వ దంపతులను కొడుకులు స్వామి, ఎల్లం రోజూ దూషిస్తూ, చంపుతామని బెదిరించారు. వేధింపులు తట్టుకోలేక దంపతులు సిద్దిపేట పోలీసులను ఆశ్రయించారు. CP ఆదేశాలతో కుమారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

March 30, 2026 / 07:22 AM IST

ఎల్‌ఓసీ మంజూరు చేసిన ప్రభుత్వ విప్

SRCL: కొనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన అనుముల బాలవ్వ అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చికిత్స అందేలా ప్రభుత్వం నుండి రూ.2 లక్షల 50 వేల రూపాయలు వైద్య ఖర్చుల కోసం వెంటనే ఎల్‌వోసీ మంజూరు చేయించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఆది శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

March 30, 2026 / 07:21 AM IST