KRNL: ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ గుప్తా ఒక ప్రకటనలో చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకేషనల్ జూనియర్ కాలేజీలో జాబ్‌మేళా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. జాబ్‌మేళాలో 16 కంపెనీలు పాల్గొంటున్నాయి. మొత్తం 1110 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.