GNTR: వాణిజ్య కార్యకలాపాల కోసం గృహ గ్యాస్ సిలిండర్లను దుర్వినియోగం చేస్తున్న హోటళ్లపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని ఒక హోటల్లో పరిశీలనలో మూడు గృహ సిలిండర్లు అక్రమంగా ఉపయోగిస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అత్యవసర సరుకుల చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.