NDL: పాములపాడు మండలం మైనార్టీ కాలనీలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో సామూహిక నూతన గృహాల ప్రారంభోత్సవం జరిగింది. ఎమ్మెల్యే జయసూర్య ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి గృహాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర యాదవ సంఘం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సొసైటీ ఛైర్మన్ గోవిందు, పలువురు నేతలు పాల్గొన్నారు.