VSP: మధురవాడలో నగరంపాలెం 80 అడుగుల రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సీపీఐ సోమవారం జీవీఎంసీ PGRSలో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఏరియా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. వీఎంఆర్డీఏ నిధులతో చేపట్టిన పనులు ఆలస్యమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రజలు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.