NDL: నంద్యాల నియోజకవర్గ రైతు నగరంలో శిల్పానగర్ వద్ద నిర్మించిన టిడ్కో గృహాలను మంత్రి ఫరూక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఈ గృహ సౌకర్యాన్ని కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.