తెలంగాణ ఉద్యమ సమయంలో ‘మిలియన్ మార్చి’ సందర్భంగా నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.