MDK: నూతన విద్యాపాలసిలో ప్రతి గ్రామపంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ పాఠశాలలో పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభించి తరగతికి ఒక టీచర్‌ను, ప్రీ ప్రైమరీకి ఒక టీచర్‌ను కేటాయించాలని ఎస్జిటియు రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. తూప్రాన్‌లో రాష్ట్ర శాఖ సమావేశం నిర్వహించగా రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, మధుసూదన్, జింక అశోక్ పాల్గొన్నారు.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా కండోమ్ల తయారీకి అవసరమైన ముడిసరుకుల సరఫరా నిలిచిపోవడంతో, వాటి ఉత్ప త్తి గణనీయంగా పడిపోయింది. తయారీలో లూబ్రికేషన్ కోసం వాడే సిలికాన్ ఆయిల్ కొరత ఏర్పడడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దీనికి తోడు కండోమ్ చిరిగిపోకుండా ఉండటానికి ఉపయోగించే అమ్మోనియా ధరలు 40 శాతానికి పైగా పెరగడం తయారీదారులకు పెను భారంగా మారినట్లు తెలుస్తోంది.
TG: సీఎం రేవంత్ రెడ్డితో మేనకాగాంధీ బృందం భేటీ అయింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ చర్యలపై అధికారులు వివరించారు. వీధికుక్కలకు స్టెరిలైజేషన్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు.
SRPT: కోదాడ పబ్లిక్ క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో అగ్రస్థానంలో నిలుపుతామని, నూతన అధ్యక్ష, కార్యదర్శులు కత్రం సీతారామిరెడ్డి, పోటు రంగారావు ఆదివారం క్లబ్ ఆవరణలో ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలిపారు. వినోదం, వికాసం, విజ్ఞానం లక్ష్యాలుగా పాలకవర్గం పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగారావు,గురునాథం, విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.
KDP: సి.కె దిన్నె పరిధిలోని ఊటుకూరు సర్కిల్ వద్ద సి.ఐ బాల మద్దిలేటి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించి, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
KRNL: అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతోందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి విమర్శించారు. ఆదివారం రాంపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రకటించిన అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించడంలేదని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
HYD: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు కొనసాగాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ చేరికలతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని, పార్టీలో చేరిన వారందరికీ తగిన ప్రాధాన్యత కల్పిస్తామని కేటీఆర్ అన్నారు.
RRతో రేపు జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ట్రైనింగ్ సెషన్‌లో గాయపడ్డాడు. దీంతో అతడు రేపటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. ఇప్పటికే ధోనీ గాయంతో దూరమవ్వగా, ఇప్పుడు బ్రెవిస్ కూడా దూరం కావడం జట్టుకు పెద్ద లోటు అని పేర్కొన్నాడు.
WNP: పెబ్బేరు మండల శివారులో కల్వరాల గ్రామంలోని బంధువుల ఇంటికి మోటార్ సైకిల్ పై బత్తుల కృష్ణయ్య అతని భార్య వరలక్ష్మి వెళ్తున్నారు.అతివేగంతో TS06FC1728 గల కారు కృష్ణయ్య ను డి కొట్టింది. దీంతో కృష్ణయ్యకు తలకు, తన భార్య కాళ్ళకు గాయాలు అయ్యాయి. దీనిపై కృష్ణయ్య వదిన శిరీష ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు.
NRPT: భీమా ఎత్తిపోతల పథకంలో చిన్న గోపులాపూర్ లిఫ్టు వద్ద 2018 నుంచి నిలిచిపోయిన పంపును పునరుద్ధరించడంతో స్థానికులు మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ప్రభుత్వం రూ.5.88 కోట్లు కేటాయించి మరమ్మతులు పూర్తి చేసింది. ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు.
SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి పొన్న వాహన సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు స్వామివారికి ప్రత్యేక మంగళహారతులు అందించి శోభాయాత్ర నిర్వహించారు. గ్రామమంతా భక్తి వాతావరణంతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఆంజనేయులు యాదవ్, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ఆదివారం అంబేడ్కర్ స్మరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్ పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. రాజ్యాంగ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
సత్యసాయి: లేపాక్షి మండలం చోళ సముద్రం టోల్‌గేట్ వద్ద రూరల్ సీఐ జనార్ధన్, లేపాక్షి ఎస్ఐ నరేంద్ర సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వాహనాలను పరిశీలించి పత్రాలు చెక్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డ్రైవర్లకు సూచించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించారు. శాంతి భద్రతల కోసం తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో KKR 220/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రహానే(67) హాఫ్ సెంచరీతో చెలరేగగా, ఫిన్ అలెన్ 37 పరుగులు చేశాడు. గ్రీన్(18) తక్కువ పరుగులకే ఔట్ అయినప్పటికీ, రాఘువంశీ (51), రింకూ సింగ్ (33) చివర్లో ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. MI టార్గెట్: 221.
TPT: బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ ప్రవీణ్ ఎస్. నాయర్ తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు. అనంతరం దాత కుటుంబ సభ్యులకు రంగనాయక మండపంలో అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.